Ram Charan:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఒకప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నా.. ఈమధ్య డ్యాషింగ్ లుక్కుతో అందరి చూపును తనవైపే తిప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రాంచరణ్ చేతి మణికట్టు వద్ద గాయమైన విషయం తెలిసిందే. అయినా సరే రామ్ చరణ్ ఆ గాయాన్ని లెక్కచేయకుండా.. మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొని అభిమానులకు చేరువయ్యారు.
అయితే గత తాలూకు గాయం ఆయనను ఇబ్బంది పెట్టడంతో.. ఇటీవల కోయంబత్తూర్ లోని గంగా హాస్పిటల్ లో అత్యంత ప్రతిభావంతులైన ఆర్థోపెడిక్ సర్జన్ల సమక్షంలో సర్జరీ చేయించుకున్నారు రామ్ చరణ్. సర్జరీ తర్వాత కోయంబత్తూర్ లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించిన ఈయన.. తాజాగా తొలిసారి మీడియా ముందుకు వచ్చి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.తాజాగా రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన స్మార్ట్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాదులో ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్కైరూట్ వార్షికోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరై ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. అలాగే తనదైన స్టైల్, సహజమైన చరిష్మాతో ఈవెంట్ కే హైలెట్ గా మారారు. ముఖ్యంగా ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ తన లుక్ తో అక్కడున్న వారందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన రామ్ చరణ్ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:మెడలో తాళిబొట్టుతో కనిపించిన జబర్దస్త్ ప్రియాంక.. వీడియో వైరల్ !
బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో సినిమా చేసిన రామ్ చరణ్.. ప్రస్తుతం సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘రంగస్థలం’ సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ సినిమా కాంబో రిపీట్ కాబోతుండడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. ప్రస్తుతం రామ్ చరణ్ సర్జరీ పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో.. ఆరు వారాల నుండి 8 వారాలు విశ్రాంతి తీసుకున్నాకే ఆయన సుకుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కానుంది.