E-Paper
Advertisement

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!
Advertisement

Mahindra Vision X Patent: మహీంద్రా న్యూ జెనరేషన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెవలప్ మెంట్ లో కీలక ముందడుగు వేసింది. కంపెనీ ఇటీవల ప్రదర్శించిన విజన్ X కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న కొత్త మోడల్‌ కు సంబంధించిన డిజైన్ పేటెంట్ దాఖలైంది. ఈ పేటెంట్ ద్వారా రాబోయే ఎస్‌యూవీ డిజైన్‌పై కొన్ని కీలక వివరాలు బయటకు వచ్చాయి. ఆటో నిపుణుల అంచనా ప్రకారం, ఇదే మోడల్ రానున్న రోజుల్లో నెక్ట్స్ జెనరేషన్ మహీంద్రా XUV 3XOగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

నాలుగు కొత్త ఎస్‌యూవీల తయారీ

మహీంద్రా ఇప్పటికే తన కొత్త NU_IQ మాడ్యులర్ ప్లాట్‌ ఫామ్ ఆధారంగా నాలుగు కొత్త ఎస్‌యూవీలను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాట్‌ ఫామ్ పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ లాంటి పలు పవర్‌ ట్రెయిన్లకు అనుకూలంగా రూపొందించబడింది. అలాగే ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్, సెటప్‌ లకు సపోర్టు చేస్తుంది. కొత్త ప్లాట్‌ ఫామ్‌ పై రానున్న తొలి మోడల్ విజన్ S కాన్సెప్ట్ ఆధారంగా ఉంటుందని, ఆ తర్వాత విజన్ X కాన్సెప్ట్ ఆధారిత కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రెండు మోడళ్లు కూడా మహీంద్రా కొత్త డిజైన్ ను కలిగి ఉంటాయి.

కొత్త ఎస్‌యూవీ స్పోర్టీ క్రాస్‌ ఓవర్ లుక్‌

Advertisement

డిజైన్ పేటెంట్ ప్రకారం, కొత్త ఎస్‌యూవీ స్పోర్టీ క్రాస్‌ ఓవర్ లుక్‌ తో కనిపించనుంది. ముందు భాగం బలమైన డిజైన్‌ తో పాటు ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వనున్నారు. బోనెట్ లుక్, వెనుక భాగంలో కూపే స్టైల్ విండ్‌ స్క్రీన్, రూఫ్ స్పాయిలర్ లాంటి అంశాలు మహీంద్రా ఇటీవల విడుదల చేసిన BE 6 మోడల్‌ ను గుర్తు చేస్తాయి. అలాగే ఈ ఎస్‌యూవీలో మహీంద్రా ట్విన్ పీక్స్ లోగో కనిపిస్తోంది. దీంతో ఇది కంపెనీ XUV ఫ్యామిలీలో భాగంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. లైటింగ్ డిజైన్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ లాంటి అంశాల్లో కూడా XEV 9e నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది.

కొత్త మోడల్ గురించి..

కొత్త మోడల్‌ లో స్క్వైర్ వీల్ ఆర్చ్‌ లు, బ్లాక్ బాడీ క్లాడింగ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, డోర్ల మీద పవర్ ఫుల్ క్యారెక్టర్ లైన్లు లాంటి అత్యాధునిక డిజైన్ అంశాలు ఉండనున్నాయి. ఇవి ఎస్‌యూవీకి మరింత ప్రీమియం లుక్‌ ను ఇవ్వనున్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త NU_IQ ప్లాట్‌ ఫామ్ హైబ్రిడ్ టెక్నాలజీకి పూర్తిగా అనుకూలంగా ఉంటుందని మహీంద్రా ఇప్పటికే తెలిపింది. కంపెనీ ప్రస్తుతం 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త పవర్‌ ట్రెయిన్ విజన్ X ఆధారిత ఎస్‌యూవీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.  అంతేకాకుండా, ఇదే మోడల్‌ కు పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌ ను కూడా తీసుకురావచ్చని భావిస్తున్నారు. దీంతో పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ లాంటి మూడు రకాల ఆప్షన్స్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Read Also: జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Tags

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×