Kiran Abbavaram : షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సాధించుకుని హీరోగా స్థిరపడ్డాడు కిరణ్ అబ్బవరం. మొదటి రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించడంతో వరుసగా అవకాశాలు వచ్చేసాయి. అయితే అవకాశాలు వదులుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ సినిమాలు పడితే ఆ సినిమాలు చేసేసాడు. అవికాస్త కెరియర్ కి మైనస్ గా మారాయి.
వరుస సినిమాలు ఫెయిలవుతున్నప్పుడు ఆడియన్స్ ఆ హీరోని నమ్మి థియేటర్ కు రావడానికి ఇష్టపడరు. సరిగ్గా కిరణ్ అబ్బవరం కు కూడా అదే జరిగింది. మళ్లీ క వంటి కాన్సెప్ట్ బే సినిమా వస్తేగానీ కం బ్యాక్ ఇవ్వలేని పరిస్థితి. ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. అయితే ఆ సినిమాకి తమిళ్ ఇండస్ట్రీలో కనీసం థియేటర్లు కూడా దొరకలేదు. అప్పుడు తను చెప్పిన స్టేట్మెంట్ కూడా బాగా వైరల్ అయింది. రీసెంట్ టైమ్స్ లో కూడా మళ్లీ ఆ స్టేట్మెంట్ వైరల్ గా మారింది.
తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకుల ఆదరించిన రేంజ్ లో తెలుగు సినిమాలను తమిళ్ ప్రేక్షకులు ఆదరించరు అనేది వాస్తవం. బాహుబలి, ట్రిపుల్ ఆర్ , పుష్ప వంటి సినిమాలను ఆదరించడం కామన్ గా జరుగుతుంది. కానీ చిన్న సినిమాలను అక్కడ ఆదరిస్తారా అంటే అది డౌట్.
కానీ మన ప్రేక్షకులు మాత్రం ఏ తమిళ సినిమా చిన్నది వచ్చినా కూడా దానిని చూస్తాం. ఈ తరుణంలో కిరణ్ అబ్బవరం ఒక మాస్ ప్లాన్ ఏసాడు. ఏకంగా తమిళ తెలుగు భాషల్లో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
ఖచ్చితంగా ఇప్పుడు కిరణ్ అబ్బవరం సినిమాకి తమిళనాడులో కూడా థియేటర్లు దొరుకుతాయి. అయితే ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం క్లారిటీ ఇచ్చేసాడు.
ఏ సినిమా కోసం అయితే తమిళనాడులో థియేటర్స్ కావాలి అని అడిగారో మళ్లీ ఆ హీరో సినిమాకి తమిళనాడులో థియేటర్స్ దొరకాలి. తెలుగు యంగ్ హీరోల సత్తా ఏంటో అక్కడ కూడా కిరణ్ అబ్బవరం చూపించాలి. ఎందుకంటే చాలామంది తమిళ యంగ్ హీరోస్ ఇక్కడ మంచి సక్సెస్ సాధించారు.
సిద్ధార్థ, కార్తీ, శివ కార్తికేయన్ వంటి అందరూ హీరోల సినిమాలుకు ఇక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలానే తెలుగు హీరోలు కూడా తమిళనాడులో సక్సెస్ అయితే ఆ కిక్కే వేరు.
Also Read: Pradeep Ranganathan: ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా, నాకు అలాంటివి చేయాలని కోరిక