BigTV English

Manchu Lakshmi: బాడీ షేమింగ్‌ కామెంట్స్‌.. మంచు లక్ష్మికి సీనియర్‌ జర్నలిస్ట్‌ క్షమాపణలు

Manchu Lakshmi: బాడీ షేమింగ్‌ కామెంట్స్‌.. మంచు లక్ష్మికి సీనియర్‌ జర్నలిస్ట్‌ క్షమాపణలు


Manchu Lakshmi-Journalist Controversy: ప్రముఖ సీనియర్జర్నలిస్ట్నటి మంచు లక్ష్మికి క్షమాపణలు చేప్పారు. మూవీ ఇంటర్య్వూలో ఆమెపై సదరు జర్నలిస్ట్చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. మంచు లక్ష్మి, ఆమె తండ్రి మంచు మోహన్‌ బాబు ప్రధాన పాత్రలో నటించని దక్ష మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమెపై ప్రముఖ జర్నలిస్ట్‌ బాడిషేమింగ్చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె వయసు, డ్రెస్సింగ్పై అవమానకర రీతిలో కామెంట్స్చేశారు. దీనిపై భగ్గమన్న లక్ష్మి అక్కడే సదరు జర్నలిస్ట్ని కడిగిపారేసింది.

ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు

అంతేకాదు వ్యవహరంపై ఆమె ఫిలిం ఛాంబర్లోనూ జర్నలిస్ట్పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వ్యవహరంలో సదరు జర్నలిస్ట్స్పందిస్తూ మంచు లక్ష్మికి క్షమాపణలు చెప్పారు. మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. “నటి మంచు లక్ష్మితో తాను చేసిన ఇంటర్వ్యూలో అడిగిన ఒక ప్రశ్న ఆమెకు మనస్తాపం కలిగించిందని తెలిసింది. ఈ విషయంలో ఎవరిని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. లక్ష్మి బాధపడ్డారని తెలిసింది కాబట్టి, ఆమెకు నిస్సందేహంగా క్షమాపణ చెబుతున్నాను. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందని ఆశిస్తున్నానుఅని ఆయన వీడియోలో పేర్కొన్నారు.


Also Read: Deepika Padukone: దీపికా పదుకొనెకు కేంద్రం అరుదైన గౌరవం.. దేశంలోనే మొదటి వ్యక్తిగా గుర్తింపు!

మంచు లక్ష్మి అసంతృప్తి

సదరు జర్నలిస్ట్క్షమాపణలపై తాజాగా మంచు లక్ష్మి స్పందించింది. ఆయన వివరణపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. “ఒక వ్యక్తి నుంచి క్షమాపణ పొందడానికి నాకు మూడు వారాల సమయం పట్టింది. నేను ఈ సారి మౌనంగా ఉండాలని అనుకోలేదు. ఎందుకంటే నా కోసం నేను నిలబడకపోతే, మరెవరూ నిలబడరని తెలుసు. ఈ అనుభవం నన్ను చాలా లోతుగా గాయపరిచింది. నాకు కావల్సింది కేవలం ఒక నిజమైన క్షమాపణ. బాధ్యతను స్వీకరించడం మాత్రమే.

ఇలాంటి చిన్న చిన్న ప్రతిఘటనలే ఆడవాళ్ళ గొంతుని మూగబోకుండా కాపాడుతాయని నా అభిప్రాయం. నాకంటే ముందు ధైర్యంగా మాట్లాడిన ఆడవాళ్ల వరుసలోనే నేనూ నిలబడి ఉన్నాను. వారి ధైర్యమే నాకీరోజు బలాన్ని ఇచ్చింది. పత్రికా రంగం వృత్తిపై నాకు చాలా గౌరవం ఉంది. ప్రజలకు నిజం తెలియజేయడంలో ప్రాణం పెట్టే జర్నలిస్టులు ఈ సమాజానికి వెలుగు చూపే దీపాల్లాంటి వారు. కానీ, అలాంటి గౌరవమైన శక్తి వారు సంబాషణల కంటే వ్యక్తిగత దాడుల కోసం వాడినప్పుడు ఎంతో బాధ కలిగిస్తుందిఅని మంచు లక్ష్మి తన పోస్ట్లో పేర్కొంది.

Related News

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం మాస్ ప్లానింగ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్

Pradeep Ranganathan: ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా, నాకు అలాంటివి చేయాలని కోరిక

Rajesh danda : 17 కోట్లు అనుకుని దిగితే మించిపోయింది, ఆఫీస్ మూతపడుద్ది అన్నారు

Deepika Padukone: దీపికా పదుకొనెకు కేంద్రం అరుదైన గౌరవం.. దేశంలోనే మొదటి వ్యక్తిగా గుర్తింపు!

Kiran Abbavaram: మైత్రి రవి, ప్రదీప్ రంగనాథన్ ఇష్యూపై స్పందించిన కిరణ్ అబ్బవరం

Skn The Raja Saab : ప్రభాస్ రాజా సాబ్ సెట్స్ లో ఏడ్చిన ఎస్ కే ఎన్, అసలు ఏం జరిగింది?

Rajamouli: రాజమౌళికి ‘ జక్కన్న’ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఇంత స్టోరీ ఉందా?

Big Stories

×