Deepika Padukone: హీరోయిన్ దీపికా పదుకొనె పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. విమర్శలు, వివాదాలతో తరచూ ఆమె వార్తల్లో నిలుస్తోంది. స్పిరిట్, కల్కి 2 చిత్రాల ఆమె తొలగించడం ఆమెకు తీవ్ర నెగిటివిటీ వస్తోంది. ఇదే సమయంలో హిజాబ్ ధరించి యాడ్ నటించడంతో మరింత వివాదానికి దారి తీసింది. దీంతో నెటిజన్స్, ఆడియన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న క్రమంలో దీపికాకు అరుదైన గౌరవం దక్కింది. నేడు(అక్టోబర్ 10) మానసిక ఆరోగ్య దినొత్సవం సందర్భంగా దీపికాను ఇండియా అంబాసిడర్గా నిమమించారు. కా గా ది లివ్ లవ్ లాఫ్(LLL) ఫౌండేషన్ ద్వారా దీపికా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో నేడు మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఆమెను అంబాసిడర్గా నియమిస్తూ ప్రకటించింది. దీపికాను మనదేశ మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా (Mental Health Ambassador) నియమించడం ద్వారా దేశంలో మానిసిక ఆరోగ్యం సమస్యల గురించి విస్త్రతంగా అవగాహన కల్పించడంలో సహాయపడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో అభిప్రాయపడింది. మనదేశ తొలి మానసిక ఆరోగ్య రాయబారిగా ఎంపికవ్వడంపై దీపికా పదుకొనే ఆనందం వ్యక్తం చేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా పనిచేయడం తనకు దక్కిన అరుదైన గౌరవమని, చాలా గౌరవంగా ఉందని పేర్కొంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మొదటి సారి దేశ మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం శుభసూచికమని, ఇది మానసి ఆరోగ్యం సంరక్షణకు గణనీయమైన పురోగతి అని పేర్కొంది. మెంటల్ హెల్త్ సమస్యలపై దేశవ్యాప్తంగా అవగాన కల్పించడంలో మరింత బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చిది. అదే విధంగా తాను 2015లో స్థాపించిన ది లైవ్ లవ్ లాఫ్ ప్రయాణం గురించి కూడా ప్రస్తావించింది. దాదాపు పదేళ్ల క్రితం ఈ సంస్థను ప్రారంభిచానని తెలిపింది. బాధితులంత నువ్వు ఒక ప్రాణం కాపాడవు.. నువ్వు నా కూతురికి సహాయం చేశావంటూ నా దగ్గరి వచ్చిన చెప్పినప్పుడు వచ్చే ఆ ఆనందం, సంతృప్తి మరెక్కడా నాకు దొరకలేదు అని తెలిపింది.
Also Read: Trisha: పెళ్లే కాదు హనీమూన్ డేట్ కూడా ఫిక్స్… పెళ్లి వార్తలపై త్రిష రియాక్షన్
మానసిక ఆరోగ్య సంరక్షణకు యోగా, ధ్యానం వంటి భారతీయ సంప్రదాయాలను కూడా మన రోజువారి జీవితంలో సాధారణ ప్రక్రియగా మార్చడంలో కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కాగా ఒకప్పుడు తాను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యానంటూ గతంలో పలు ఇంటర్య్వూలో దీపికా చెప్పిన సంగతి తెలిసిందే. తన తల్లిదండ్రులు, స్నేహితులు తన చూట్టూ ఉండి.. తనని మానసిక ఒత్తిడి నుండి బయటపెడేశారని తెలిపింది. అప్పుడు వారి మాటల వల్లే ఈ ఫేజ్ నుంచి బయటపడ్డానని చెప్పింది. తనలాగే మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ది లైవ్ లవ్ లాఫ్ పేరుతో ఫౌండేషన్ స్థాపించినట్టు తెలిపింది.