Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండియా డేంజర్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) గురించి తెలియని వారు ఉండరు. ఫుల్ అండ్ ఎనర్జిటిక్ గా ఎప్పుడు ఉండే హార్దిక్ పాండ్యా పర్సనల్ జీవితం మాత్రం అయోమయంగా ఉంది. కొడుకు ఆగస్త్యా పాండ్యా పుట్టిన తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చి, బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు హార్థిక్ పాండ్యా. అప్పుడప్పుడు కొంతమంది అమ్మాయిలతో తిరిగిన సింగిల్ గానే ఉండేవాడు. అయితే అలాంటి హార్దిక్ పాండ్యా, తన ప్రియురాలిని పరిచయం చేశాడు. మహికా శర్మనే తన లవర్ అంటూ బాంబు పేల్చాడు హార్థిక్ పాండ్యా. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Also Read: IND-W vs SA-W: కొంపముంచిన హర్మన్.. దక్షిణాఫ్రికా విక్టరీ..పాయింట్ల పట్టికలో టీమిండియా సేఫ్
నటాషాకు ( Natasha) విడాకులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త ప్రియురాలిని పరిచయం చేశాడు హార్థిక్ పాండ్యా. ప్రముఖ మోడల్ మహికా శర్మను ( Mahika Sharma ) ప్రేమిస్తున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చాడు హార్థిక్ పాండ్యా ( HARDIK PANYA). ఇటీవలే మహికా శర్మతో విమానాశ్రయంలో అడ్డంగా దొరికిపోయిన హార్దిక్ పాండ్యా, ఇప్పుడు ఓపెన్ అయిపోయాడు. తన పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రియురాలు మహికా శర్మను పరిచయం చేశాడు.
ఆమెతో విదేశాల్లో ఎంజాయ్ చేసిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, బర్త్డే ట్రీట్ అభిమానులకు ఇచ్చాడు. మహికాశర్మ పై చేతులు వేసి మరి రొమాంటిక్ ఫోజ్ ఇచ్చాడు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టడం గమనార్హం. దీంతో హార్దిక్ పాండ్యా పెట్టిన పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది. ఈ ఫోటోను చూసిన నెటిజెన్స్, అభిమానులు తెగ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే పెళ్లి భోజనం హార్దిక్ పాండ్యా పెట్టించబోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కంగ్రాట్స్ హార్దిక్ పాండ్యా అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. అదే సమయంలో పుట్టినరోజు గ్రీటింగ్స్ కూడా కామెంట్ల రూపంలో పెడుతున్నారు.
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పరిచయం చేసిన అమ్మాయి మహికా శర్మ బ్యాక్ గ్రౌండ్ పెద్దగానే ఉంది. 1994 జులై 26వ తేదీన ఈ అందాల తార జన్మించింది. అస్సాం రాష్ట్రానికి సంబంధించిన టిన్సుకియా అనే ప్రాంతంలో మహికా శర్మ జన్మించారు. కొన్ని టీవీ ఛానల్ లో ఈమె పని చేసి ఆ తర్వాత మోడల్ గా ఎదిగారు. పలువురు సెలబ్రిటీలను కూడా గతంలో ఇంటర్వ్యూలు చేసిన దాఖలాలు ఉన్నాయి. పలు సినిమాలలో కూడా నటించి, మెప్పించారట మహికా శర్మ. ఇక త్వరలోనే పాండ్యాను పెళ్లి చేసుకోనున్నారట.
Also Read: MS Dhoni: CSK ఫ్యాన్స్ కు ధోని గుడ్ న్యూస్….రూ.325 కోట్లతో భారీ స్కెచ్, కాళ్లు మొక్కిన కుర్రాడు
Hardik Pandya with his love ♥️🌹 pic.twitter.com/zUQgMfg5a6
— Team India (@FCteamINDIA) October 10, 2025