Rajesh danda : ఒక ఆలోచనను నమ్మే డబ్బులు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. కొన్నిసార్లు ఆ ఆలోచన వర్కౌట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుంది. వర్కౌట్ కాకపోతే సినిమా డిజాస్టర్ గా మిగిలిపోతుంది. ఇలా సినిమా నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్నాక ఫిలిం ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే ఒక సినిమా హిట్ కొట్టి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు.
ఇలా మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించి క్వాలిటీ సినిమాలో నిర్మిస్తున్న నిర్మాతలలో రాహుల్ యాదవ్ నక్క ఒకరు. ఆ తర్వాత ఊరు పేరు భైరవకోన అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాజేష్ దండ కూడా ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ కొంత స్థానాన్ని సంపాదించుకొని విజయవంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ తరుణంలో రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
ఊరి పేరు భైరవకోన సినిమాని అనుకున్నప్పుడు దగ్గర దగ్గరగా 17 కోట్లలో అయిపోద్ది అని అనుకున్నారట. కానీ ఆ సినిమా 20 కోట్ల వరకు అయిపోయింది. అప్పట్లో అది చాలా రిస్కు అని అందరూ అన్నారు. నా వెనక కూడా చాలామంది మాట్లాడారు. సినిమాతో ఈ ఆఫీస్ మూత పడిపోద్ది అని కూడా మాట్లాడుకున్నారు.
మాపైన రాంగోపాల్ వర్మ ఆఫీసు ఉండేది. కిందెవరో కొత్త ప్రొడ్యూసర్ అంట, 20 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది ఈ సినిమాతో ఆఫీస్ మూత పడిపోతుంది ఖాళీ అయిపోద్ది అని చెప్పారట. నా మీద చాలా మంది జోకులు కూడా వేసుకున్నారు. నాకు కొంతమంది అడ్వైజర్ కూడా ఇచ్చారు. నేను సాధించుకున్నాను. రిలీజ్ కి హిట్ కొట్టాను.
ఈ బ్యానర్ లో ఇప్పటికే మంచి సక్సెస్ఫుల్ సినిమాలు వచ్చాయి. శ్రీ విష్ణు నటించిన సామజవర్గమున సినిమా ఈ బ్యానర్ కి మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టింది. అది మరోవైపు శ్రీ విష్ణు కెరియర్ కి కూడా మంచి ప్లస్ పాయింట్ గా మారింది. ఆ సినిమాని అప్పుడు మినీ మహానటి అని కూడా కొంతమంది పొగిడారు.
ప్రస్తుతం ఈ బ్యానర్ లో కిరణ్ అబ్బవరం హీరోగా K-Ramp అనే సినిమా వస్తుంది. సినిమా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఉండబోతుందని చిత్ర యూనిట్ ముందు నుంచే చెబుతుంది. ఈ సినిమా మీద కూడా కొంతమేరకు అంచనాలు నెలకొన్నాయి. ప్లీజ్ అయిన టీజర్ ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Also Read: Kiran Abbavaram: మైత్రి రవి, ప్రదీప్ రంగనాథన్ ఇష్యూపై స్పందించిన కిరణ్ అబ్బవరం