Rajamouli: టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్.ఎస్ రాజమౌళి(S.S.Rajamouli)ని అందరూ కూడా చాలా ముద్దుగా ప్రేమగా “జక్కన్న” (Jakkanna) అంటూ పిలుస్తూ ఉంటారు. ఇలా రాజమౌళిని టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ కూడా జక్కన్న అంటూ పిలుస్తూ ఉంటారు. కానీ అసలు ఈయనకు ఈ పేరు ఎందుకు వచ్చింది? ఈ బిరుదును రాజమౌళికి ఎవరు ఇచ్చారనే విషయాలు బహుశా చాలామందికి తెలియకపోవచ్చు కానీ, ఈ పేరు వెనుక పెద్ద స్టోరీ ఉందని తెలుస్తోంది. మరి రాజమౌళికి జక్కన్న అనే బిరుదు ఎలా వచ్చింది? ఆ బిరుదును ఆయనకు ఇచ్చింది ఎవరు? ఈ పేరు వెనుక ఉన్న కథ ఏంటి? అనే విషయానికి వస్తే…
రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే హీరోలను ఎలా పిండి పిప్పి చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్క సన్నివేశం చాలా క్లియర్ గా వచ్చేవరకు రాజమౌళి ఆ సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా చెక్కుతూ ఉంటారు. సినిమాల పరంగా రాజమౌళి మోనార్క్ లాగా ఎవరి మాట వినరు. ఆయన అనుకున్నది సాధించే వరకు కష్టపడుతూనే ఉంటారు.. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్1(Student No 1) . ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు అర్ధరాత్రి 12:30 గంటల వరకు షూటింగ్ చేస్తున్న నేపథ్యంలో నటుడు రాజీవ్ కనకాల(Rajeev Kanakala) రాజమౌళిని ఉద్దేశించి మాట్లాడుతూ..
వామ్మో పని రాక్షసుడు చెక్కుతున్నాడు సీన్లన్నీ జక్కన్న లాగా అంటూ సరదాగా మాట్లాడారట అయితే ఆరోజు రాజీవ్ కనకాల జక్కన్న లాగా అంటూ మాట్లాడటంతో అప్పటినుంచి ఎన్టీఆర్ (NTR)రాజమౌళితో మాట్లాడాలి అంటే జక్కన్న అని పిలుస్తూ మాట్లాడే వారట. అలా ఆయనకు జక్కన్న అనే పేరు వచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ పేరును రాజీవ్ కనకాల పెట్టారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక రాజమౌళి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తో చాలాసేపు షూటింగ్ చేసేవారట ఒక సన్నివేశం ఆయన అనుకున్న విధంగా వచ్చినప్పటికీ ఇంకా మంచిగా వస్తుందేమోనని ఎక్కువ టేక్స్ తీసుకునేవారు అంటూ పలు సినిమాల ప్రమోషన్లలో భాగంగా హీరోలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
పరిశీలనలో వారణాసి…
ఇక రాజమౌళి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈయన మహేష్ బాబుతో ప్రస్తుతం మరో పాన్ ఇండియా సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు వారణాసి(Varanasi) అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం.