OTT Movie : హాలీవుడ్ సినిమాల నుంచి వచ్చే కొన్ని సినిమాలు విచిత్రమైన స్టోరీలతో వస్తుంటాయి. ఈ స్టోరీలు మరొకరికి చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఒక అమ్మాయికి విచిత్రమైన పవర్ ఉంటుంది. ఇది మగాళ్లకు ప్రాణాల మీదకి తెస్తుంటుంది. ఆమె దీని నుంచి ఎలా బయట పడిందనేదే ఈ కథ. ఇది ఒంటరిగా చూడాల్సిన సినిమా. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘టీత్’ ఒక హారర్ కామెడీ సినిమా. దీనికి మిచెల్ లిచెన్‌స్టీన్ దర్శకత్వం వహించారు. ఇందులో జెస్ వెక్స్లర్, హేల్ ఆపిల్‌మన్, జాన్ హెన్రీ ష్వార్త్జ్‌మన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2008 జనవరి 18న అమెరికాలో రిలీజ్ అయింది. IMDbలో 5.4/10 రేటింగ్ తో ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథలో హీరోయిన్ కి 18 ఏళ్ల వయసు ఉంటుంది. ఆమె సోషల్ ఆక్టివిటీస్ లో చురుగ్గా ఉంటుంది. పెళ్ళికి ముందు శృంగారం మంచిది కాదని కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేస్తుంది. అయితే ఈ సమయంలో ఒక విచిత్రం జరుగుతుంది. ఒక రోజు ఆమె స్టెప్ బ్రదర్ తనపై అనుచితంగా ప్రవర్తిస్తాడు. అప్పడు ఉన్నట్టుండి అతని ప్రైవేట్ పార్ట్ కట్ అవుతుంది. దీనికి కారణం తెలుసుకుని, హీరోయిన్ షాక్ అవుతుంది. ఆమెకు ఒక చోట దంతాలు ఉండటమే ఇందుకు కారణం. ఈ విషయం ఆమె తన మదర్‌కు చెబుతుంది. కానీ ఆమె హీరోయిన్ నే తప్పుబడుతుంది. అబద్ధాలు చెప్పడం మానుకోమని హెచ్చరిస్తుంది.
Read Also : ఇదెక్కడి క్రైమ్ థ్రిల్లర్రా బాబూ… కూతుర్ల కోసం పగతో రగిలిపోయే తల్లులు… మోసగాడిని బ్రతికించి చేయకూడని పని
ఇక ఈ మిస్టీరి గురించి తెలుసుకోవడానికి ఆమె ఒక డాక్టర్‌ను కలుస్తుంది. అయితే డాక్టర్ ఆమెకు మత్తు ఇచ్చి పాడు పని చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతని ప్రైవేట్ పార్ట్ కట్ అయిపోతుంది. ఇదంతా చూసి షాక్ అయిన హీరోయిన్, తన ప్రాబ్లం ను ప్రియుడితో షేర్ చేసుకుంటుంది. వీళ్ళు ఈ సమస్యకి ఒక పరిష్కారం కనిపెడతారు. దీంతో హీరోయిన్ చాలా సంతోషంగా ఉంటుంది. వీళ్ళు కనిపపెట్టిన పరిష్కారం ఏమిటి ? ఆ టీత్ వల్ల ఎంత మంది బలయ్యారు ? అనే విషయాలను, ఈ హారర్ కామెడీ సినిమాని చూసి తెలుసుకోండి.