Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నటిస్తున్న K -Ramp సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు. రీసెంట్ గా ఒక తమిళ జర్నలిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడుతూ… ప్రదీప్ రంగనాథన్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు. కానీ నేను క అనే ఒక సినిమా చేస్తే తమిళ్లో నాకు కనీసం థియేటర్స్ కూడా దొరకలేదు అని చెప్పాడు.
ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న డ్యూడ్ సినిమా అక్టోబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో నిన్న ట్రైలర్ బ్లాస్ట్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో మైత్రి రవి కు ఈ అంశాన్ని గురించిన ప్రశ్న ఎదురయింది. దీనికి మైత్రి రవి ఆన్సర్ ఇస్తూ.. అలా ఏమీ లేదు మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా థియేటర్స్ దొరుకుతాయి. మనకు ఉన్న థియేటర్స్ కంటే కూడా అక్కడ థియేటర్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. టాక్ బట్టి థియేటర్స్ అడ్జస్ట్ చేసుకుంటారు అని చెప్పారు. ఆ విషయాలు పై కిరణ్ స్పందించారు.
నేను తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము తమిళ్ సినిమాలను సెలబ్రేట్ చేసుకుంటాం సార్ అని చెప్పాను. మధ్యలో థియేటర్స్ ఇష్యూస్ మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం కాలేదు. తెలుగు థియేటర్స్ గురించి నేను అసలు మాట్లాడలేదు.
నేను శివ కార్తికేయన్ అన్నతో మాట్లాడాను. లవ్ టుడే సినిమా హిట్ అయిన తర్వాత తెలుగులోకి వచ్చినప్పుడు, సమ్మతమే డైరెక్టర్ గోపి ఆ సినిమాకి ఏదో ఇన్వాల్వ్ అయ్యాడు. నేను ఫోన్ కాల్ తీసుకుని ఇమిడియట్ గా ప్రదీప్ రంగనాథన్ తో కూడా మాట్లాడాను. భ్రమరాంబ థియేటర్ కథను వస్తే నేను ఫోన్ చేసి విష్ చేశా.
ప్రదీప్ రంగనాథన్ మాలాగే కష్టపడి షార్ట్ ఫిలిమ్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాడు. నాకు అతను అంటే చాలా గౌరవం. ఇప్పుడు కనిపించినా కూడా అస్ ఏ ఫిలిం మేకర్ పర్సన్ ఆయనంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి సినిమాలు చేశాడు.
రవి గారికి అసలు కన్వే అయిందో లేదో నాకు తెలియదు. రవి గారు నేను కూడా వర్క్ చేసాం, ఫ్యూచర్ లో కూడా చేస్తాం. నేను కూడా నిన్న ఐదు ఆరు మంది దగ్గర విన్నాను. మళ్లీ నెక్స్ట్ సినిమా కోసం సింపతి అంట అని అనడం కూడా నాకు బాధేసింది. అంటూ రియాక్ట్ అయ్యాడు కిరణ్.
Also Read: Skn The Raja Saab : ప్రభాస్ రాజా సాబ్ సెట్స్ లో ఏడ్చిన ఎస్ కే ఎన్, అసలు ఏం జరిగింది?