Skn The Raja Saab : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో ఎస్ కే ఎన్ ఒకరు. జర్నలిస్టుగా కెరియర్ స్టార్ట్ చేసిన ఎస్ కే ఎన్ అంచెలంచెలుగా ఎదిగి ప్రొడ్యూసర్ గా మారారు. ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత కూడా సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు. ఇప్పటివరకు ఒక్క డిజాస్టర్ సినిమా కూడా చేయలేదు.
నిర్మాతగా సినిమా సక్సెస్ లు కొట్టిన తర్వాత ఫేమస్ అవడం కంటే, ఒక సినిమా అభిమానిగా కొన్ని సందర్భాల్లో, కొన్ని ఈవెంట్స్ లో ఆయన మాట్లాడే విధానం వలన బాగా ఫేమస్ అయిపోయారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావడం, అలానే పాలిటిక్స్ లో సపోర్ట్ చేయడం. పిఠాపురంలో ఒక ఫ్యామిలీకి ఆటోను కొనటం ఇలాంటివి కూడా ఎస్ కే ఎన్ కు మంచి పేరును తీసుకొచ్చి పెట్టేయ్.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ది రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ను చాలా అందంగా చూపిస్తున్నాడు మారుతి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
అయితే ప్రభాస్ రాజా సాబ్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్ గారి లుక్స్, వైబ్, కాస్ట్యూమ్స్, ఎనర్జీ, అలానే సాంగ్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎస్ కే ఎన్ కి బ్లర్ గా కనిపించాయట. అలా కనిపించడానికి కారణం ఏమిటి అని అంటే తన కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. అవన్నీ కూడా ఆనందభాష్పాలు అంటూ చెప్పాడు. జనవరి 9న 2026 లో ఏం జరుగుతుందో అంటూ ఫైర్ సింబల్స్ పెట్టి ట్విట్టర్ వేదిక పోస్ట్ వేశాడు.
ఎస్ కే ఎన్ మారుతి మధ్య విపరీతమైన ఫ్రెండ్షిప్ ఉంది. వీరిద్దరిది చాలా ఏళ్ల నాటి బంధం. అందుకే మారుతీ సక్సెస్ ను కూడా ఎస్ కే ఎన్ ఎంజాయ్ చేస్తాడు. అలానే పలు సందర్భాల్లో తన గురించి కూడా మారుతి చెప్పాడు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాలు కూడా చేశారు.
ఎన్ని సినిమాలు చేసినా బేబీ సినిమా తీసుకొచ్చిన పేరు మరో సినిమా తీసుకురాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. కొన్ని సందర్భాలలో బండ్ల గణేష్ స్పీచ్ వైరల్ అవుతుంది. అయితే ఎస్ కే ఎన్ ను కూడా చాలామంది బండ్ల గణేష్ తో పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇతను కూడా అదే స్థాయిలో మాట్లాడుతాడు కాబట్టి.
Also Read: Kiran Abbavaram : సింపతి అంటే నచ్చదు.. బాధ పెట్టొద్దు అంటూ