BigTV English

Pradeep Ranganathan: ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా, నాకు అలాంటివి చేయాలని కోరిక

Pradeep Ranganathan: ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా, నాకు అలాంటివి చేయాలని కోరిక

Pradeep Ranganathan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన చాలామంది దర్శకులు ఉన్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కంటే ఎక్కువగా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలోనే షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన దర్శకులు ఎక్కువమంది ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. కోమాలి అనే సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా మారిపోయాడు ప్రదీప్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది.


తాను చేసిన సెకండ్ సినిమా లవ్ టుడే. ఈ సినిమా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఒక సంచలనం. అయితే ఇదే సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ఇక్కడితో ప్రదీప్ రంగనాథన్ తెలుగులో కూడా బాగా ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు ప్రదీప్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తుంది. ప్రదీప్ కూడా ఎక్కువగా తెలుగు సినిమాలు చూడటం మొదలుపెట్టాడు.

ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా 

ప్రదీప్ రంగనాథన్ తెలుగులో వరుసగా సినిమాలు చూస్తున్నారు. ఏకంగా ఓజి (OG Movie) సినిమా కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ వెయిట్ చేస్తున్న సినిమా ది రాజా సాబ్. మారుతి (Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


ఫ్యాన్స్ తో పాటు చాలామంది అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం మారుతి ప్రభాస్ తో ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తుండటం. ప్రభాస్ లో ఈ యాంగిల్ చూసి చాలా రోజులు అయిపోయింది. కానీ ఈ సినిమా కోసం ప్రదీప్ రంగనాథన్ ఎదురు చూడడానికి మరో కారణం ఉంది.

నాకు అలాంటివి చేయాలని కోరిక

ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ ట్రైలర్ ప్రదీప్ రంగనాథన్ కు విపరీతంగా నచ్చిందట. దానికి కారణం అతనికి ఆ జోనర్ సినిమాలంటే ఇష్టం. చంద్రముఖి (Chandramukhi) , కాంచన (Kanchana) వంటి జోనర్ సినిమాలో నాకు బాగా ఇష్టం. రాజా సాబ్ చూసినప్పుడు నాకు అదే అనిపించింది. నాకు కూడా అలాంటి సినిమాలు చేయాలి అని కోరిక ఉంది. అని చెప్పాడు ప్రదీప్.

ఇకపోతే ప్రదీప్ ఇప్పటివరకు హీరోగా చేసిన సినిమాలు అన్నీ యూత్ ఓరియెంటెడ్ స్టోరీలు. ఏ సినిమాలో అయితే కనెక్ట్ అవుతాయో అవే సినిమాలను ప్రదీప్ రంగనాథన్ చేస్తున్నాడు. అందుకే అతనికి మంచి సపోర్ట్ లభిస్తుంది. ఇకపోతే ప్రదీప్ నటిస్తున్న డ్యూడ్ (Dude) సినిమా అక్టోబర్ 17న దీపావళి కానుకగా విడుదల కానుంది.

Also Read: Rajesh danda : 17 కోట్లు అనుకుని దిగితే మించిపోయింది, ఆఫీస్ మూతపడుద్ది అన్నారు

Related News

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం మాస్ ప్లానింగ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్

Rajesh danda : 17 కోట్లు అనుకుని దిగితే మించిపోయింది, ఆఫీస్ మూతపడుద్ది అన్నారు

Manchu Lakshmi: బాడీ షేమింగ్‌ కామెంట్స్‌.. మంచు లక్ష్మికి సీనియర్‌ జర్నలిస్ట్‌ క్షమాపణలు

Deepika Padukone: దీపికా పదుకొనెకు కేంద్రం అరుదైన గౌరవం.. దేశంలోనే మొదటి వ్యక్తిగా గుర్తింపు!

Kiran Abbavaram: మైత్రి రవి, ప్రదీప్ రంగనాథన్ ఇష్యూపై స్పందించిన కిరణ్ అబ్బవరం

Skn The Raja Saab : ప్రభాస్ రాజా సాబ్ సెట్స్ లో ఏడ్చిన ఎస్ కే ఎన్, అసలు ఏం జరిగింది?

Rajamouli: రాజమౌళికి ‘ జక్కన్న’ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఇంత స్టోరీ ఉందా?

Big Stories

×