BigTV English

Sleeping without pillow: దిండు లేకుండా నిద్రపోతే శరీరానికి జరిగే అద్భుత మార్పులు ! తెలుసుకుంటే ఇకపై దిండు వేసుకోరేమో!

Sleeping without pillow: దిండు లేకుండా నిద్రపోతే శరీరానికి జరిగే అద్భుత మార్పులు ! తెలుసుకుంటే ఇకపై దిండు వేసుకోరేమో!
Advertisement

Sleeping without pillow: రాత్రి నిద్ర మన జీవితంలో ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ ఆ నిద్రలో మనం ఎలా పడుకుంటామన్నది కూడా అంతే ముఖ్యమని మీరు తెలుసా? చాలామంది నిద్రపోయే సమయంలో మృదువైన దిండు లేకుండా పడుకోలేరు. అయితే వైద్యపరంగా చూస్తే దిండు లేకుండా నిద్రపోవడం శరీరానికి ఎంతో ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ ప్రయోజనాలేమిటో వివరంగా చూద్దాం.


ముఖం గురించి చెప్పుకుందాం:

మనకు తెలుసు ప్రతి రోజు మనం ఉపయోగించే దిండు కవర్‌పై అనేక రకాల బాక్టీరియా, మట్టి, నూనెలు, చెమట తగులుతుంటాయి. మనం రోజూ దానిపైనే నిద్రపోతే ఆ మురికివాటన్నీ ముఖానికి చేరతాయి. ఫలితంగా మొటిమలు, మచ్చలు, చర్మం ముదురు కావడం వంటి సమస్యలు వస్తాయి. అయితే దిండు లేకుండా నిద్రపోతే ఈ బాక్టీరియా చర్మానికి తగలవు. దీంతో ముఖంపై మడతలు, మచ్చలు తగ్గిపోతాయి. చర్మం సహజ కాంతిని తిరిగి పొందుతుంది.


వెన్నునొప్పి:

చాలామందికి ఉదయాన్నే లేవగానే వెన్ను పట్టేయడం, నడుము నొప్పి, కింద భాగంలో బరువు అనిపించడం వంటి సమస్యలు ఉంటాయి. దీనికి ప్రధాన కారణం దిండు ఎత్తు ఎక్కువగా ఉండటం లేదా అసమతుల్యమైన స్థితిలో నిద్రపోవడం. దిండు లేకుండా నిద్రపోతే, మీ వెన్నెముక సహజమైన ఆకృతిలో ఉంటుంది. శరీర బరువు సరిగా పంచుకుంటుంది. ఫలితంగా వెన్ను నొప్పి తగ్గుతుంది, శరీరం ఉదయం లేవగానే తేలికగా అనిపిస్తుంది.

నిద్ర నాణ్యత పెరుగుతుంది:
దిండు వాడినప్పుడు కొందరికి మెడ కోణం సహజంగా ఉండదు. దాంతో మెదడుకు సరైన రక్తప్రసరణ జరగదు. కానీ దిండు లేకుండా నిద్రపోతే మెడ, వెన్ను, తల ఒకే సూటి రేఖలో ఉంటాయి. దీని వల్ల శరీరం పూర్తిగా విశ్రాంతి పొందుతుంది. నిద్ర లోతుగా వస్తుంది, మెలకువలు తగ్గుతాయి, ఉదయం లేవగానే ఉత్సాహంగా అనిపిస్తుంది.

మెడ, భుజాల నొప్పి తగ్గుతుంది:

చాలామంది నిద్రలేవగానే మెడ పట్టేసింది, భుజం నొప్పిగా ఉంది అంటుంటారు. దిండు ఎత్తు ఎక్కువగా ఉండడం వలన మెడ కండరాలు వంగి ఉంటాయి. రాత్రంతా అలా ఉండటంతో ఉదయాన్నే నొప్పి వస్తుంది. కానీ దిండు లేకుండా నిద్రపోతే తల, మెడ, భుజాలు ఒకే స్థాయిలో ఉంటాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది, నొప్పి ఉండదు.

శరీర హార్మోన్ల సమతుల్యత:

నిద్రలో మన శరీరంలో “మెలటోనిన్” అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మానసిక ప్రశాంతత, చర్మ కాంతి, హృదయ ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. దిండు లేకుండా సూటిగా నిద్రపోతే ఈ హార్మోన్ సరిగా పనిచేస్తుంది. దీని వల్ల మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

మెడ పొడవుగా, అందంగా కనిపించడంలో సహాయం:

చాలామంది దిండు ఎక్కువగా వాడుతూ ఉండటంతో మెడ ముందుకు వంగినట్టుగా కనపడుతుంది. దాంతో భంగిమ తప్పుతుంది. దిండు లేకుండా పడుకుంటే మెడ సరైన ఆకృతిలో ఉంటుంది, ఫలితంగా శరీర ఆకారం సరిగా ఉంటుంది. ముఖం సన్నగా, మెడ అందంగా కనిపిస్తుంది.

ఏ విధంగా దిండు లేకుండా నిద్రపోవాలి?

ముందుగా ఒక్కసారిగా పూర్తిగా దిండు తీసేయకండి. మొదట పల్చని తువ్వాలు లేదా సన్నని కుషన్ వాడండి. తర్వాత కొద్ది రోజులకు పూర్తిగా లేకుండా నిద్రించడం ప్రారంభించండి. మొదట రెండు మూడు రోజులు కాస్త అసౌకర్యంగా అనిపించినా, తర్వాత శరీరం అలవాటు పడుతుంది.

జాగ్రత్తలు..
మీరు మెడకు సంబంధించిన సమస్యలు, వెన్నెముక సమస్యలు, స్లిప్‌డిస్క్ వంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే దిండు లేకుండా నిద్రపోవడం మంచిది. అలాగే గర్భిణీలు, పెద్దవయసువారు కూడా వైద్యుల సూచన మేరకే ఈ మార్పు చేసుకోవాలి.

Related News

Diwali Wishes 2025: హ్యాపీ దీపావళి సింపుల్‌గా.. విషెల్ ఇలా చెప్పేయండి

Bathing: స్నానం ఎంతసేపు చెయ్యాలి? స్నానానికి ఉన్న అసలు ప్రాముఖ్యం ఇదే!

Memory: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇవి తినండి..

Dry Skin: డ్రై స్కిన్ సమస్యా ? ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్

Cracked Heels:పగిలిన మడమలకు చక్కటి పరిష్కారం.. వీటితో అద్భుతమైన రిజల్ట్

Almonds: పొరపాటన కూడా బాదంతో పాటు ఇవి తినొద్దు !

Moringa Powder For hair : ఒక్క పౌడర్‌తో బోలెడు లాభాలు.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Big Stories

×