BigTV English

Kishkindapuri Censor: కిష్కంధపురి సెన్సార్… అంతలా ఏం ఉందయ్యా… ఆ సర్టిఫికేట్ ఇచ్చారు

Kishkindapuri Censor: కిష్కంధపురి సెన్సార్… అంతలా ఏం ఉందయ్యా… ఆ సర్టిఫికేట్ ఇచ్చారు

Kishkindapuri Censor: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellam Konda Sai Srinivas) హీరోగా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్(Kaushik) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కిష్కిందపురి (Kishkindapuri). ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమా పట్ల ఎంతో మంచి అంచనాలను పెంచేస్తాయి. ఈ సినిమా హర్రర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికి ఎంతో మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో సెన్సార్ (Censor)కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.


సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..

ఇప్పటికే సినిమా వీక్షించిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు “A” సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఈ సినిమా రన్ టైం కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా 2:05 నిమిషాల నిడివితో ప్రసారం కానుంది. సాధారణంగా సినిమాలు దాదాపు 2:30 గంటలకు పైగా సినిమా నిడివి ఉంటుంది కానీ ఈ సినిమా మాత్రం 2  గంటల నిడివి ఉండడంతో ఈ తక్కువ రన్ టైంతో ప్రేక్షకులను ఆకట్టుకోగలదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ రన్ టైం చూస్తుంటే మాత్రం సినిమాని ఎక్కువగా సాగదీయకుండా సరైన కంటెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


A సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్..

ఇక ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ జారీ చేయడంతో మరికొందరు సెన్సార్ సభ్యులపై కూడా తమదైన శైలిలోనే కామెంట్లు చేస్తున్నారు. అసలు ఆ సినిమాలో అంతలా ఏముందని సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చారంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఏది ఏమైనా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద వరుసగా నిరాశను ఎదుర్కొంటున్నారు. మరి ఈ సినిమా అయినా ఈయనని ఆదుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

కిష్కిందపురి హిట్ ఇచ్చేనా?

ఈ హర్రర్ సినిమాలో  బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడిగా నటి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) నటించబోతున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 3న సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమా ముందుగా 12వ తేదీ విడుదల చేయాలి అనుకున్న అదే రోజు తేజ  హీరోగా నటిస్తున్న మిరాయ్ సినిమా విడుదలవుతున్న నేపథంలో 13వ తేదీకి వాయిదా పడింది కానీ 13వ తేదీ ఈ సినిమాని విడుదల చేయడం వల్ల పెద్ద ఎత్తున నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తిరిగి 12న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఇటీవల భైరవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Samantha: రాజ్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో వైరల్!

Related News

Anushka Shetty: డాక్యుమెంటరీగా బాహుబలి.. కన్ఫర్మ్ చేసిన స్వీటీ!

Kishkindha Puri: కిష్కిందపురి బిజినెస్.. టార్గెట్ చాలా చిన్నదే… కానీ సమస్య ఇదే

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటికి డీఆర్ఐ భారీ షాక్..ఏకంగా 102 కోట్లు ఫైన్.. మిగతా వారికి?

HBD Pawan Kalyan: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్‌ ఫోటో లీక్‌ చేసిన రాశీ ఖన్నా.. పిక్‌ వైరల్‌

Samantha: రాజ్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత.. వీడియో వైరల్!

Big Stories

×