Irfan Pathan: తన క్రికెట్ కెరీర్ నాశనం చేసింది మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni)… అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan). అతని కారణంగానే.. అర్ధాంతరంగా టీమిండియా నుంచి బయటికి రావాల్సి వచ్చిందని బాంబు పేల్చాడు ఇర్ఫాన్ పఠాన్. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ పై ఇర్ఫాన్ పఠాన్ చేసిన సంచలన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాస్తవానికి మహేంద్రసింగ్ ధోనీ పై గతంలో ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ఇర్ఫాన్ పటాన్ పై మహేందర్ సింగ్ ధోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోని చాలా గొప్పవాడని.. చాలామందిని గుర్తించి టీమిండియాలో అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లిన ఘనత అతని ఒక్కడికి సొంతం అంటూ ఫ్యాన్స్… ఇర్ఫాన్ పఠాన్ కు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో మరోసారి ధోనీ అభిమానులు వర్సెస్ ఇర్ఫాన్ పఠాన్ అన్నట్లుగా వ్యవహారం తయారయింది.
Also Read: Mitchell Starc Retirement: ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ… డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్
ధోని పై ( Mahendra Singh Dhoni) ఇర్ఫాన్ పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
టీమిండియా జట్టుకు ఎన్నో అఖండ విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోని పై ( Mahendra Singh Dhoni) ఈ మధ్యకాలంలో చాలామంది మాజీ క్రికెటర్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ధోనీని విలన్ చేసి… హీరోలు అయ్యే కుట్రలు పన్నుతున్నారు టీమిండియా మాజీ ప్లేయర్లు. ప్రతిసారి యువరాజ్ తండ్రి యోగ రాజ సింగ్.. మహేంద్ర సింగ్ ధోని ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తుంటే.. తాజాగా ఈ లిస్టులోకి ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరిపోయారు. మహేంద్ర సింగ్ ధోనీ నీ ఉద్దేశించి… హాట్ కామెంట్స్ చేశారు ధోని.
2008 సంవత్సరం ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా ( Australia vs Team India ) మధ్య సిరీస్ జరగగా… ఆ సమయంలో తాను బౌలింగ్ బాగా చేసినప్పటికీ… మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni) మాత్రం తన బౌలింగ్ బాగా లేదని స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఇర్ఫాన్ పఠాన్ తాజాగా వెల్లడించారు. తన ప్రదర్శన పై విష ప్రచారం చేశాడని మండిపడ్డారు. ఇదే విషయంపై అడిగితే అంతా బాగానే ఉందని.. చెప్పినట్లు ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశారు. అయినా కూడా వేరే వాళ్ళ గదిలో… నాకు హుక్కా ఏర్పాటు చేసే అలవాటు లేదు… అందుకే తనకు అవకాశాలు రాలేదేమో అంటూ వ్యాఖ్యానించారు ఇర్ఫాన్ పఠాన్. అంటే హుక్కా ఏర్పాటు చేస్తేనే ధోని చాన్స్ ఇచ్చేవాడని అర్థం వచ్చేలా ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
🚨 Irfan Pathan Exclusive | National Sports Day Special
The former India all-rounder opens up on Siraj’s meteoric rise, Bumrah’s workload, Gill’s leadership credentials and India’s famous Oval Test triumph.
Stay Tuned For The 2nd Part.@BSV_Global @BoriaMajumdar @IrfanPathan… pic.twitter.com/koVc8DUizI
— RevSportz Global (@RevSportzGlobal) August 29, 2025