BigTV English

Bigg Boss 9 telugu: హమ్మయ్య.. ఎట్టకేలకు ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసింది!

Bigg Boss 9 telugu: హమ్మయ్య.. ఎట్టకేలకు ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసింది!

Bigg Boss 9 telugu: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి బిగ్ బాస్ తెలుగు సిద్ధమయింది. సెప్టెంబర్ 7వ తేదీ నుండి 9వ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈసారి ఐదు మంది సామాన్యులు కామన్ మ్యాన్ క్యాటగిరిలో హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఐదు మందిని సెలెక్ట్ చేయడానికి అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు ఈ మినీ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే మొదలైన ఈ షో లో 45 మంది సామాన్యులు తమ బలాబలాలను ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ షోలో జడ్జెస్ గా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బిందు మాధవి(Bindu Madhavi), నవదీప్ (Navadeep), అభిజిత్ (Abhijeeth) వ్యవహరిస్తూ ఉండగా శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.


ఐదు మందిని హౌస్ లోకి ఈ షో ద్వారా తీసుకోబోతుండగా.. ఒక హౌస్ లోకి వెళ్ళబోయే మిగతా కంటెస్టెంట్స్ ఎవరు.. అనే ఆసక్తి గత కొద్ది రోజులుగా మొదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..

భరణి కుమార్:


సీరియల్ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. సీతామహాలక్ష్మి, సావిత్రి, తరంగాలు వంటి దాదాపు 30 కి పైగా సీరియల్స్ లో నటించారు. విజయవాడకు చెందిన ఈయన బాహుబలి సినిమాలో కూడా నటించడం జరిగింది. ఇప్పుడు ఈయనను హౌస్ లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం..

ఆశా సైనీ:

చంఢీఘర్ కి చెందిన ఈమెకు కొంతవరకు తెలుగు తెలుసు అని సమాచారం. ముఖ్యంగా ఈవిడలో ఏదో సాడ్ లవ్ స్టోరీకూడా దాగి ఉందట.. పైగా బాలకృష్ణ “లక్స్ పాప లక్స్ పాప లంచ్ కొస్తావా” సాంగ్‌లో డాన్స్ చేసింది. ఈమె నటించిన ఎక్కువ సినిమాలు.. ఒక్క రోజులో రిలీజ్ అయ్యాయి అనే కారణంతో ఈమె పేరు మీద లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కూడా ఉన్నట్లు తెలు..ఇక ఈమె ఏజ్ 46.

తనూజా గౌడ :

ప్రముఖ సీరియల్ నటి తనూజా గౌడ కూడా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈమె ముద్దమందారం, అగ్నిపరీక్ష వంటి సీరియల్లో నటించారు.

రామ్ రాథోడ్

ఫోక్ సింగర్ గా కెరియర్ మొదలుపెట్టి ఫోక్ డ్యాన్సర్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఈయన “రాను బాంబోయ్ కి రాను”, “సొమ్మసిల్లిపోతున్నావే” సాంగ్స్ తో పాపులారిటీ అందుకున్నారు.

అర్చన మనోహర్ గల్రానీ:

ఈమె ప్రభాస్ బుజ్జిగాడు మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. పెళ్లి కూడా అయింది. సోగ్గాడు మూవీలో కూడా నటించింది. ఈమె వయసు 35 ఏళ్లు.

శ్రేష్టి వర్మ :

జానీ మాస్టర్ అసిస్టెంట్. పుష్ప పుష్ప రాజ్ అనే సాంగ్ కొరియోగ్రఫీ చేసింది.

హర్షిత్ రెడ్డి

శుభం మూవీ హీరోగా చేసిన హర్షిత్ రెడ్డి.. కల్కి మూవీలో కూడా నటించాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నారు.

ఇమ్మానుయేల్:

జబర్ధస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ఇమ్మానుయేల్ కూడా ఇప్పుడు హౌస్ లోకి వెళ్లబోతున్నారు.

సుమన్ శెట్టి :

జయంతో పాటు చాలా సినిమాలు చేసిన సుమన్ శెట్టి కూడా హౌస్ లో పాల్గొనబోతున్నారు.

అలేఖ్య:

అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అలేఖ్య కూడా హౌస్ లోకి వెళ్లబోతున్నట్లు సమాచారం.

వీరంతా కూడా ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళబోతున్నట్లు సమాచారం.

ALSO READ:HHVM 2: వీరమల్లు పార్ట్ 2లో క్రిష్ సీన్స్… బిగ్ ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్!

Related News

Bigg Boss AgniPariksha: కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టిన అగ్నిపరీక్ష!

Bigg Boss AgniPariksha: చివరిదశకు చేరుకుంటున్న అగ్నిపరీక్ష.. మరీ ఇంతలా ఉన్నారేంటి?

Bigg Boss Agnipariksha : బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కంటెస్టెంట్స్ ను ఇబ్బంది పెట్టేది అందుకేనా..?

Keerthi bhat: బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదు..వారివల్ల అయినవాళ్ళు కూడా దూరం!

Bigg boss Agni Pariksha: బ్రెయిన్ టాస్క్ కి ఆడియన్స్ ఫిదా.. మరీ ఇంత తుత్తర అయితే ఎలా?

Big Stories

×