BigTV English

Kishkindhapuri: ఎవరిని మోసం చేస్తారు.. ఆ సినిమాను మక్కీకి మక్కీ దించి.. ఒరిజినల్ అంటారేంటి

Kishkindhapuri: ఎవరిని మోసం చేస్తారు.. ఆ సినిమాను మక్కీకి మక్కీ దించి.. ఒరిజినల్ అంటారేంటి

Kishkindhapuri: ఈ మధ్య ట్రెండింగ్ జోనర్ ఏదైనా ఉంది అంటే అది హర్రర్ అని చెప్పొచ్చు. ప్రేక్షకులను భయపెట్టి మూడు గంటలు సీట్ లో కూర్చోపెట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు డైరెక్టర్స్. అయితే అన్ని దెయ్యం కథలు ఒకేలా ఉంటాయి. చూపించే విధానం, దెయ్యం చచ్చిన కారణాలు మాత్రమే వేరుగా ఉంటాయి. తాజాగా టాలీవుడ్ లో ప్రేక్షకులను భయపెట్టడానికి మరో హర్రర్ ఫిల్మ్ రెడీ అవుతోంది. అదే కిష్కింధపురి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా కిష్కింధపురి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. ఎక్కడో ఈ సినిమా చూసినట్లు ఉందే అనిపించకమానదు. సాధారణంగా అన్ని హర్రర్ సినిమాలు అన్ని ఒకే ఫార్మాట్ లో ఉంటాయి అనుకోండి. అది వేరే విషయం. కానీ, ఈ సినిమా మాత్రం  ఒక సినిమాకు మక్కీకి మక్కీ దించినట్లుగా అనిపిస్తుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అదే అగత్యా.  కోలీవుడ్ హీరో జీవా, రాశీఖన్నా జంటగా పా. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్జున్ సర్జా కీలక పాత్రలో నటించాడు.

ఈ ఏడాదిలోనే అగత్యా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో చాలామంది ప్రేక్షకులకు అసలు ఇదొక సినిమా ఉంది అన్న విషయం కూడా తెలియకపోవచ్చు. కానీ, ఈ రెండు సినిమాల్లోనూ ఒకటే కాన్సెప్ట్. ప్రస్తుతం ప్రజలలో దెయ్యాల మీద ఉన్న ఆసక్తిని కొందరు క్యాష్ చేసుకోవడం ఇందులో మెయిన్ పాయింట్ గా చూపించారు. హీరో, హీరోయిన్ కలిసి.. ఒక ఊరిలో పాడుబడ్డ బంగ్లాను వెతికి.. అందులో ఆర్టిఫీషియల్ గా సౌండ్స్, దెయ్యాల థీమ్ ను అరేంజ్ చేసి.. దానికి టికెట్ పెట్టి.. లోపలికి వచ్చేవారికి అందులో దెయ్యం ఉందని నమ్మిస్తారు.


ఇక అలా సాగిపోతున్న ఆ బంగ్లాలో నిజంగా దెయ్యం ఉందని తెలుస్తోంది. ఆ తరువాత హీరోహీరోయిన్.. ఆ ఇంట్లో ఆ దెయ్యం తాలూకు కథను తెలుసుకొని దానికి సహాయం చేయడానికి ముందుకొస్తారు. అందులో భాగంగా వారి శరీరంలోకే ఆత్మలు ప్రవేశించి తమ పగను తీర్చుకుంటాయి. ఇది కథ. ఇలాంటి కాన్సెప్ట్ ఆల్రెడీ అగత్యాలో చూపించారు. ఇప్పుడు సేమ్ స్టోరీ కిష్కింధపురి ట్రైలర్ లో చూపించారు. ఇక్కడ కూడా హీరోహీరోయిన్స్.. సువర్ణ మాయ అనే ఇంటికి వెళ్లి.. అందులో దెయ్యాలా థీమ్ ను పెట్టి.. ప్రజలను రప్పించినట్లు చూపించారు. ఆ తరువాత వారే దెయ్యాలుగా మారి.. పగ తీర్చుకున్నట్లు చూపించారు. ఈ  రెండు సినిమా కథలు ఒకేలా ఉండడంతో.. చాలామంది ఆ సినిమాకు కాపీ కదా .. ఎవరిని మోసం చేస్తారు అంటూ మండిపడుతున్నారు. కాన్సెప్ట్ ఒకటే కావచ్చు.. కథ వేరు అయ్యి ఉండొచ్చు అని అనుకుంటే.. సెప్టెంబర్ 12 న కిష్కింధపురిని తప్పకుండా చూడొచ్చు. మరి ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

MLC Kavitha: సంతోష్‌ రావ్‌.. చిరంజీవి, ప్రభాస్‌లను కూడా మోసం చేశాడు..

Mirai First Review: సెకండాఫ్‌లో బోరింగ్ సీన్స్… ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ?

Gayatri Gupta: రోజూ అలాంటి టచ్ ఉండాల్సింది… లేకపోతే గాయత్రికి నిద్రపట్టదట

Allu Sirish: అన్నలా అవ్వడం కష్టం కానీ.. మనం రూట్ మారుద్దాం

Shilpa Shetty: తన రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన శిల్పాశెట్టి .. అదే కారణమా..?

Big Stories

×