Smartphones: ప్రతి వారం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఏదో ఒక కొత్త అప్‌డేట్ తప్పనిసరిగా వస్తూనే ఉంటుంది. టెక్నాలజీ అభివృద్ధి పెరుగిపోతున్న ఈ రోజుల్లో, మనకు కొత్త ఫోన్లు, కొత్త ఫీచర్లు, కొత్త డిజైన్లు పరిచయం కావడం ఒక ట్రెండ్‌లా మారిపోయింది. ముఖ్యంగా పండుగ సీజన్ లేదా ప్రత్యేక ఆఫర్లు ఉన్న సమయంలో, టాప్ బ్రాండ్‌లు తమ అద్భుతమైన మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ వారం కూడా ఇండియా మార్కెట్‌లో ఇండియన్ మార్కెట్ లో నాలుగు కొత్త స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో రియల్‌మీ, టెక్నో, ఐటెల్, సామ్‌సంగ్ వంటి బ్రాండ్‌లు ఉన్నాయి.
50 మెగాపిక్సెల్ రేంజ్
ఈ ఫోన్లలో ప్రతి ఒక్కటీ తనకంటూ ప్రత్యేక ఫీచర్లు, కొత్త టెక్నాలజీలు కలిగి ఉండటంతో టెక్నాలజీ ప్రేమికులకు, యువతకు ఎక్కవగా ఆకర్షిస్తున్నాయి. ఈ కొత్త ఫోన్లలో ఒక ప్రత్యేక ఏమిటంటే, A1 ఫీచర్లు మరింత అప్ గ్రేడ్ కావడం. కెమెరా క్వాలిటీ కూడా 50 మెగాపిక్సెల్ రేంజ్‌కి పెరిగింది. ఫోటోలు మరింత క్లారిటీగా, సినిమాటిక్ లుక్‌లో రావడానికి వీటిని డిజైన్ చేశారు. అంతేకాకుండా, 3డీ అమోలేడ్ స్ర్కీన్ ఉండడం వలన వీడియలు, గేమింగ్, సినిమాలు చూసేటప్పుడు మంచి అనుభూతి లభిస్తుంది. ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న ఫోన్‌లు కేవలం కాల్ చేయడం కోసం మాత్రమే ఉపయోగించే పరికరం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఇది మన జీవితంలో భాగమైపోంది. ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఎడిటింగ్, సోషల్ మీడియా ఏదైనా పని చేసుకోవడానికి ఫోన్ తప్పనిసరి అయిపోయింది. అందుకే కొత్త ఫీచర్లు ఉన్న ఫోన్లపై కస్టమర్లకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది.
Also Read: OYO Offers: ఓయో హోటల్స్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. 75% తగ్గింపు మిస్ కాకండి!
ఈ వారం మొబైల్ మోడల్స్ ఇవే
రియల్‌మీ బ్రాండ్ : ఈ సారి స్టైలిష్ డిజైన్‌తో పాటు, త్వరగా ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన మోడల్‌ను తీసుకొచ్చింది.
టెక్నో బ్రాండ్ : తక్కువ ధరలో కానీ, హై ఎండ్ ఫీచర్లతో యూత్‌ని ఆకర్షిస్తోంది.
ఐటెల్ : ఐటెల్ ఎంట్రీ లెవెల్ ఫోన్లను కానీ, మోడరన్ టచ్‌తో అందిస్తోంది.
సామ్‌సంగ్ : సామ్‌సంగ్ మాత్రం తన గ్యాలక్సీ సిరీస్‌లోని కొత్త మోడల్‌తో మరోసారి బలమైన పోటీ ఇస్తోంది.
తప్పని సరిగా పరిశీలించండి
కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని అన్ని బ్రాండ్లు 5జీ సపోర్ట్‌తో కూడిన ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. అంటే, ఇకపై డేటా స్పీడ్, స్ట్రీమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉండబోతోంది. మొత్తానికి, ఈ వారం విడుదలైన ఫోన్లన్నీ బడ్జెట్‌కి తగ్గట్టుగా కూడా, ప్రీమియమ్‌లుక్ ఇచ్చేలా కూడా ఉన్నాయి. ఎవరికీ అవసరమైతే వారికి తగ్గట్టుగా మోడల్ ఎంచుకునే అవకాశముంది. కాబట్టి మీరు కొత్త ఫోన్ కొనాలని అనుకుంటే, ఈ వారం లాంచ్ అయిన మోడల్స్‌ని తప్పక పరిశీలించాల్సి ఉంటుంది. ఫీచర్లు, ధరలు, డిజైన్ అన్నీ కలిపి చూసి మీ బడ్జెట్ రేంజ్‌లో సరిపడే ఫోన్ ఎంచుకుంటే మీరు వాడుకునేందుకు అవకాశం మంచి అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీకు దగ్గరలో ఉండే మొబైల్ స్టోర్ కు వెళ్ళి నాలుగు విడుదలైన స్మార్ట్ ఫోన్లను పరిశీలించి మీకు నచ్చింది మీరు ఎంచుకోండి.