BigTV English

Kavitha vs BRS: నాన్న.. నువ్వు జాగ్రత్త.. ప్రెస్ మీట్‌లో కవిత ఎమోషనల్.. కేటీఆర్, హరీష్ రావులపై ఫైర్!

Kavitha vs BRS: నాన్న.. నువ్వు జాగ్రత్త.. ప్రెస్ మీట్‌లో కవిత ఎమోషనల్.. కేటీఆర్, హరీష్ రావులపై ఫైర్!

Kavitha: పార్టీ సస్పెండ్ చేసిన 20 గంటల తర్వాత ఎమ్మెల్సీ కవిత నోరు విప్పారు. తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ హైకమాండ్‌ని ఆమె ప్రశ్నించారు. తాను ఎక్కడ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానో చూపించాలని సవాల్ విసిరారు. బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు ఎమ్మెల్సీ కవిత.


బీఆర్ఎస్ పార్టీ సామాజిక తెలంగాణకు వ్యతిరేకమా? అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. హరీష్‌‌రావు-సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ అవుతుందా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నలు రైజ్ చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ భవన్‌లో పార్టీ దృష్టికి తెచ్చానన్నారు. ఈ విషయంలో కేటీర్ తనకు ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం లేదన్నారు.

ఇవాళ్టికి 100 రోజులు పైగానే అయ్యిందని, కనీసం ఒక్క మాట కూడా ఎవరూ మాట్లాడలేదన్నారు. పార్టీ వ్యవస్థ పని చేసేది ఇలాగేనా అంటూ సూటిగా హైకమాండ్ కు ప్రశ్నలు సంధించారు. తన పరిస్థితి ఇలా ఉంటే, పార్టీలో ఉండే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని అన్నారు.


ఇవాళ తనకు ఎదురైన పరిస్థితి రేపటి రోజున కేటీఆర్‌కు ఎదురుకావచ్చని ఆయన్ని హెచ్చరించారు కవిత. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునే కుట్రలో భాగంగానే తనను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్‌రావు-సీఎం రేవంత్ రెడ్డి ఓకే విమానంలో వచ్చారా? లేదా? అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాతే తనపై కుట్రలు మొదలయ్యాయన్నారు.

ALSO READ: ఓ వైపు మిలాద్.. గణేష్ నిమజ్జనం, భద్రతపై కమిషనర్ సమీక్ష

హరీష్‌రావు డబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటరని వ్యాఖ్యానించారు. ఆయనే ట్రబ్బుల్ క్రియేట్ చేసి బబుల్ షూట్ చేస్తారన్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను అధినేత కేసీఆర్‌కు పంపుతున్నట్లు చెప్పారు. దైవ సామానులు కేసీఆర్‌కు తాను ఒక్కటే విఙ్ఞప్తి చేస్తున్నానని, మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు.

బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి హరీష్‌రావు పన్నాగాలు పన్నుతున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడిన తర్వాత నా పైన ఇంత పెద్ద కుట్ర చేశారని విమర్శించారు. హరీష్‌పై విచారణ అనగానే ఒక్కరోజు మాత్రమే హడావుడి ఉంటుందని, ఆ తర్వాత రోజు అసలు దాని గురించి న్యూస్ ఉండదన్నారు.

2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు హరీష్‌రావు సపరేట్ గా ఫండింగ్ చేశారన్నారు. ఆ డబ్బు ఆయనకు ఎక్కడ నుండి వచ్చిందని ప్రశ్నించారు. అవి కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి చేసిన డబ్బులేనని కుండబద్దలు కొట్టేశారు. కేటీఆర్‌-కేసీఆర్‌లను ఓడించేందుకు హరీష్‌రావు చేసిన కుట్రలను ఈ సందర్భంగా వివరించారు.

రామన్నకు తన గురించి ఎవరు ఏం చెప్పారో తెలీదు కానీ, నాకు మాత్రం మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే తాను కేసీఆర్‌కు కూతురిగా పుట్టానని, రామన్న.. కేసీఆర్ ఆరోగ్యంతోపాటు పార్టీని కాపాడాలని చెప్పుకొచ్చారు.

ఆరడగుల బుల్లెట్టు ఇవాళ తనను గాయపరిచిందని, నేడో రేపో కేటీఆర్‌ను గాయపరుస్తుందని చెప్పకనే చెప్పారు. హరీష్‌రావు వల్లే ఈటెల రాజేందర్ పార్టీ నుంచి బయటికి వెళ్ళారని చెప్పారు. ఇతర ముఖ్య నేతలు హరీష్ వల్ల పార్టీని విడిచి వెళ్లే ప్రమాదముందని బీఆర్ఎస్ హైకమాండ్‌ని హెచ్చరించారు.

కేటీఆర్ యూట్యూబ్‌ను మేనేజ్మెంట్ చేస్తే.. హరీష్‌రావు మెయిన్ స్ట్రీమ్ మీడియా‌ను మేనేజ్ చేస్తారంటూ లోగుట్టు బయటపెట్టారు. పార్టీ నుండి వచ్చిన MLC పదవి తాను రాజీనామా చేస్తున్నాను, స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

సంతోష్‌రావు చెప్పు‌లో రాయి.. చెవిలో జోరీగ అంటూనే ఆయన చేసిన ఘనకార్యాలను బయటపెట్టారు కవిత. రామన్న నియోజకవర్గంలో ఇసుక ట్రాక్టర్ ప్రమాదంలో ఓ దళిత బిడ్డ చనిపోతే సంతోష్‌రావు పోలీసులను మానేజ్ చేసి వాళ్లను అనేక ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.

గగ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెట్టీ అనేక అక్రమాలు చేశారని, మొకిలలో 750 కోట్ల రూపాయలు విల్లా ప్రాజెక్టు చేస్తున్నారని ఆరోపించారు. ఇక సంతోష్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్, MLC నవీన్ రావు కూడా అంతే. ఆయన తండ్రి పేకాటలో పట్టుపడితే ఆ కేసు ఏం అయ్యిందని ప్రశ్నించారు. బ్లూ పిన్ అనే కంపెనీ స్థాపించి అనేక అక్రమాలు తెరలేపారని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి తాను సవాల్ విసురుతున్నానని, వాళ్లని అరెస్టు చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

Related News

CM Revanth Reddy: కల్వకుంట్ల కుటుంబం కాలం చెల్లిన నోట్లలాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TG High Court: కాళేశ్వరం కమీషన్ రిపోర్ట్..స్టే కు నో చెప్పిన హైకోర్టు

Kavitha: బీఆర్ఎస్‌లో అవినీతి? ఆ బడా నేతల గుట్టు రట్టు చేసిన కవిత, త్వరలో మరికొందరి జాతకాలు?

Hyderabad News: ఓ వైపు మిలాద్.. గణేష్ నిమజ్జనం, భద్రతపై కమిషనర్ సమీక్ష

Kavitha: కవిత పదవికి రాజీనామా? మీడియా సమావేశంలో ఏం చెబుతారు, బీఆర్ఎస్‌లో చర్చ

Big Stories

×