BigTV English

Crime News: పండుగ పూట విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి.. ఆ తర్వాత తల్లి..

Crime News: పండుగ పూట విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి.. ఆ తర్వాత తల్లి..
Advertisement

Crime News: పండుగ పూట నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లిలో విషాదం నెలకొంది. దీపావళి వేళ ఒకే కుటుంబంలో ముగ్గరు మృతి చెందారు. ఇద్దరు పిల్లల్ని చంపి సూసైడ్ చేసుకుంది తల్లి. రాత్రి కుటుంబ కలహాలతో ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు భర్త. మనస్థాపం చెందిన భార్య నాగలక్ష్మి.. తన ఇద్దరు పిల్లలను చంపి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కొండమల్లేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇద్దరు పిల్లల్ని చంపి.. ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న తల్లి నాగలక్ష్మి..
నాగలక్ష్మి కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు. పిల్లలు అవంతిక, భువన్ సాయి ఇంకా చిన్న వయసు వారు.. అయితే నిన్న రాత్రి తదుపరి కారణాల వల్ల భర్తతో గొడవపడింది నాగలక్ష్మీ.. ఆ తర్వాత, భర్త ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో మనస్థాపం చెందిన నాగలక్ష్మి, తన ఇద్దరు చిన్నారులను చంపేసి, తాను కూడా ఊరేసుకుని మరణించింది.

పండుగ పూట విషాదం
ఈ సంఘటన దీపావళి పండుగ సమయంలో జరగడంతో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొండమల్లెపల్లి మండల కేంద్రం నల్లగొండ జిల్లాలో ఒక చిన్న పట్టణం వంటిది, ఇక్కడి ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడతారు. కానీ ఈ సంఘటన గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. పండుగ వాతావరణంలో బాణసంచా శబ్దాలు, దీపాల వెలుగుల మధ్య ఇలాంటి విషాదకర సంఘటన జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.


Also Read: ముంచుకొస్తున్న ముప్పు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. బయటకు వెళ్లారో ముంచేస్తోంది

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే, ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో, భర్తతో జరిగిన గొడవే ఈ దారుణానికి కారణమని తేలింది. భర్తను వెతికి ప్రశ్నించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Related News

Riyaz Encounter: రౌడీ రియాజ్ మృతి.. హాస్పిటల్ లో ఏం జరిగింది?

CMR Founder Passes Away: బిగ్ బ్రేకింగ్.. సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్స్‌ వ్యవస్థాపకుడి కన్నుమూత

Firecracker Blast: బాణసంచా నిల్వ ఉన్న ఇంట్లో భారీ పేలుడు.. నలుగురు మృతి

Nizamabad News: రియాజ్‌ను ఎన్ కౌంటర్ చేయలేదు.. నిజామాబాద్ సీపీ కీలక ప్రకటన

Asifabad Crime: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌డెడ్

Water Tank Collapse: విషాదం.. వాటర్ ట్యాంక్ కూలి తల్లీకుమారుడి మృతి

VC Sajjanar: ఏంటీ సమాజం.. సాటి మనిషి ఆపదలో ఉంటే..? నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య ఘటనపై వీసీ సజ్జనార్ స్పందన

Big Stories

×