Thammudu Child Artist..టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ (Nithin ) చివరిగా వెంకీ కుడుముల (Venky kudumula) దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ సినిమా చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్.. ఈ సినిమాతో ఎలా అయినా సరే విజయం అందుకోవాలని చూశారు. దీనికి తగ్గట్టుగానే యంగ్ బ్యూటీ శ్రీ లీలా (Sree Leela) కూడా ఈయన సరసన నటించింది. అంతేకాదు డేవిడ్ వార్నర్ (David Warner)ని కూడా రంగంలోకి దింపారు. ఇలా ఎన్ని చేసినా సరే కథ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఇక దీంతో ఎలాగైనా సరే ఇప్పుడు మళ్లీ సక్సెస్ కొట్టాలని ఆరాటపడుతున్నారు నితిన్.
జూలై 4న నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్..
అందులో భాగంగానే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మూవీ ‘తమ్ముడు’ టైటిల్ తో నితిన్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూలై 4వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాకి వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వం వహించి మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక వకీల్ సాబ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నితిన్ తో తమ్ముడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తమ్ముడు మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న లయ..
అంతేకాదు ప్రముఖ సీనియర్ హీరోయిన్ లయ (Laya) కూడా ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో నితిన్ కి అక్కగా , ఒక పవర్ఫుల్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇటీవల ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్, టీజర్ , ట్రైలర్ తెలియజేశాయి. ఇకపోతే జూలై 4వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో మరొకవైపు సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం అందులో భాగంగానే ఈ ఈ సినిమాలో లయ కూతురుగా, నితిన్ మేనకోడలిగా నటించిన పాప అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.
నితిన్ ఎత్తుకున్న ఈ చిన్నారి బ్యాక్ గ్రౌండ్ ఇదే..
ముఖ్యంగా ఈ సినిమా పోస్టర్లలో, ట్రైలర్ లో కూడా నితిన్ ఆ పాపని ఎత్తుకొని బాగా హైలైట్ అయ్యారు. ఇప్పుడు ఆ పాప ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ పాప పేరు దీత్య (Deethya). ఇప్పటికే ప్రమోషన్స్ లో పాల్గొని తన క్యూట్ మాటలతో, ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ మెప్పిస్తోంది. పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది .ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో తన తండ్రిలాగే తనకు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది ఈ చిన్నారి.
ALSO READ: Actress Sana Khan : కళ్యాణ్ రామ్ హీరోయిన్ తల్లి మృతి… హాస్పిటల్‌లో పోరాడుతూ…
సక్సెస్ అయితే వరుస ఆఫర్లు గ్యారెంటీ..
ఇకపోతే తమ్ముడు సినిమాలో లయకి కూతురుగా, నితిన్ కి మేనకోడలిగా నటించిన దీత్య ఈ సినిమాలో ఏ రేంజ్ లో మెప్పించిందో చూడాలి అంటే థియేటర్లలో సినిమా వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఒకవేళ ఈ సినిమా గనుక ఈ పాపకు ప్లస్ అయింది అంటే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈమెకు మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమాలో స్వాసిక విజయ్ (Swasika Vijay), వర్షా బొల్లమ్మ (Varsha bollamna), సప్తమి గౌడ (Saptami Gowda) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న తమ్ముడు చైల్డ్ ఆర్టిస్ట్..
ఇకపోతే ఈ చిన్నారి ‘జాబిలి కబుర్లు’ అని యూట్యూబ్ ఛానల్ ని కూడా నిర్వహిస్తోంది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా టెంపుల్స్ వ్లాగ్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ప్రస్తుతం ఈ ఛానల్ ను హోల్ లో పెట్టినట్లు సమాచారం. ఇకపోతే దీత్య ను అందరూ జాబిలి అని ముద్దుగా పిలుస్తారట. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ మాత్రమే ఉపయోగిస్తున్నానని.. అందులో ‘అక్షర జాబిలి’ అని ఉంటుందని తాజా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
యూట్యూబర్ మాత్రమే కాదు కూచిపూడి డాన్సర్ కూడా..
ఇక ఈ పాప గొప్ప కూచిపూడి డాన్సర్ కూడా కావడం గమనార్హం.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==