Roja Ramani..టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది లవ్ బర్డ్స్ ఉన్నారు. వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆర్తి అగర్వాల్ (Arti Agarwal), తరుణ్ (Tarun) లు కూడా ఉంటారు.అయితే ఆర్తి అగర్వాల్(Aarthi Agarwal) ప్రస్తుతం మన ముందు లేకపోయినప్పటికీ ఆమె గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయం మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అలా చాలా రోజుల నుండి ఆర్తి అగర్వాల్,తరుణ్ ల ప్రేమ గురించి ఎన్నో వార్తలు వినిపించాయి.
బలవంతపు పెళ్లి.. ఆఖరికి ప్రాణాలే కోల్పోయిన హీరోయిన్..
ముఖ్యంగా ఆర్తి అగర్వాల్ తరుణ్ ని పెళ్లి చేసుకోకపోవడం వల్లే ఆమె తల్లిదండ్రుల బలవంతంతో ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూడా వార్తలు వినిపించాయి. చివరికి అతనితో కలిసి ఉండలేక, విడాకులు ఇచ్చేసి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అదే సమయంలో లావుగా ఉన్నారని అందరూ విమర్శలు చేయడంతో లైపోజేషన్ చేయించుకొని, అది వికటించడంతో మరణించింది. అయితే దీనికి తరుణ్ (Tarun) కూడా ఒక కారణం అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే తరుణ్.. ఆర్తి అగర్వాల్ ని పెళ్లి చేసుకొని ఉంటే ఇదంతా జరిగేది కాదు. హ్యాపీగా తరుణ్ తో లైఫ్ లీడ్ చేసేది అంటూ ఉంటారు. అయితే తాజాగా తరుణ్ తో ఆర్తి అగర్వాల్ ప్రేమ, పెళ్లి గురించి తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది తరుణ్ తల్లి రోజా రమణి (Roja Ramani).
ఆర్తి అగర్వాల్ – తరుణ్ పెళ్లి పై రోజా రమణి కామెంట్స్..
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా రమణి (Roja Ramani)కి ఆర్తి అగర్వాల్ – తరుణ్ ల రిలేషన్ గురించి ప్రశ్న ఎదురైంది.. ఇక ఈ ప్రశ్నపై రోజా రమణి స్పందిస్తూ.. “తరుణ్ ఆర్తి అగర్వాల్ లు ప్రేమించుకున్నారు అనేది పూర్తిగా అవాస్తవం. అది వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటించడం వల్లే ఇండస్ట్రీలో కొంతమంది క్రియేట్ చేసిన రూమర్స్ మాత్రమే. ఒకవేళ నిజంగానే ఆర్తి అగర్వాల్ , తరుణ్ లు ప్రేమించుకుంటే వాళ్లు మేజర్స్ కదా.. మాకు ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా.. ఒకవేళ మాకు చెప్పడం ఇష్టం లేకపోతే ఒకవేళ మేం పెళ్లికి ఒప్పుకోకపోతే.. వెళ్లిపోయి అయినా పెళ్లి చేసుకోవచ్చు కదా?వాళ్ళిద్దరూ ఎందుకు అలా చేసుకోలేదు.. సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళిద్దరూ మేజర్స్ కావడంతో పెళ్లి చేసుకున్నా కూడా ఎవరు ఏమీ అనరు.. నిజంగానే ప్రేమించుకున్నట్లయితే వారు ఎప్పుడో పెళ్లి చేసుకునేవారు.. ఈ రూమర్స్ చాలాసార్లు మమ్మల్ని బాధపెట్టాయి.
రూమర్స్ అంటూ కొట్టి పారేసిన రోజా రమణి..
అయితే ఓసారి తరుణ్ ఈ విషయం గురించి అడిగితే అలాంటిదేమీ లేదమ్మా అని చెప్పాడు. ఒకవేళ వాడికి నిజంగానే ఆ అమ్మాయి నచ్చితే నాకు చెప్పొచ్చు కదా.. లేకపోతే వాడే ఇంట్లో నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవచ్చు.ఆ రెండు చేయలేదంటే వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని అర్థం చేసుకోవచ్చు అంటూ రోజా రమణి చెప్పుకొచ్చింది.
Also read: Thammudu Child Artist: నితిన్ ఎత్తుకున్న ఈ చిన్నారి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
రోజా రమణి పై ఆర్తి ఫ్యాన్స్ ఫైర్..
అయితే రోజా రమణి మాటలపై చాలామంది ఆర్తి ఫ్యాన్స్ స్పందిస్తూ.. తరుణ్, ఆర్తి అగర్వాల్ ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు. అందుకే తరుణ్ ని బలవంత పెట్టి ఆర్తి అగర్వాల్ ని దూరం పెట్టేలా చేశారు. తరుణ్, ఆర్తి అగర్వాల్ ని పెళ్లి చేసుకుంటే ఇంట్లో నుండి వెళ్లిపోమ్మని లేకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించి ఉంటారు. అందుకే తల్లి ప్రేమకు లొంగి తరుణ్ తను ప్రేమించిన అమ్మాయిని వదిలేశారు. వారిద్దరి పెళ్లి కాకపోవడానికి మీరే కారణం. తరుణ్, ఆర్తి అగర్వాల్ పెళ్లి చేసుకొని ఉంటే ప్రస్తుతం ఆర్తి అగర్వాల్ మన ముందు ఉండేది అంటూ చాలామంది ఆర్తి అగర్వాల్ ఫ్యాన్స్ తరుణ్ తల్లి రోజా రమణి పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇక తరుణ్ , ఆర్తి అగర్వాల్ లు కలిసి నువ్వు లేక నేను లేను(Nuvvu Leka Nenu Lenu), సోగ్గాడు(Soggadu) వంటి సినిమాలు చేసారు.