Sana Khan Mother Death..సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ప్రముఖ నటి సనా ఖాన్ (Sana khan) ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె తల్లి సయీదా కన్నుమూశారు. ఈ మేరకు సనా ఖాన్ తన తల్లిని తలుచుకుంటూ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.” నా ప్రియమైన తల్లి అనారోగ్య సమస్యతో పోరాడుతూ ఇప్పుడు అల్లాహ్ వద్దకు చేరుకున్నారు” అంటూ ఆమె కన్నీటి పర్యంతమవుతూ పోస్ట్ చేయడం ఇప్పుడు అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. సనా ఖాన్ తల్లి మరణంతో ఇండస్ట్రీ కూడా మూగబోయింది. ప్రస్తుతం దుఃఖంలో ఉన్న సనా ఖాన్ కు స్వాంతన చేకూరేలా ఆమెకు అండగా సెలబ్రిటీలు మెసేజ్లు పెడుతున్నారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి అని.. సనా ఖాన్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో పోరాడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అయితే ఇప్పుడు ఆమె తుది శ్వాస విడిచినట్లు సనా ఖాన్ తెలిపారు.
సనా ఖాన్ సినిమాలు..
సనా ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. భారతీయ సినీ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. హిందీ చిత్రాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటించి ఆకట్టుకుంది . 1987 ఆగస్టు 21న ముంబై మహారాష్ట్రలో జన్మించిన ఈమె.. నటి మాత్రమే కాదు రూపదర్శి, నర్తకి కూడా. 2005లో వచ్చిన హిందీ చిత్రం ‘యే హై హై సొసైటీ’ అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ తర్వాత 2006లో వచ్చిన ‘E’ అనే చిత్రం ద్వారా అతిథి పాత్రతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అంతేకాదు 2008లో వచ్చిన ‘సిలంబట్టం’ అనే తమిళ చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటిగా ITFA అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత 2010 వరకు తమిళ్, హిందీ చిత్రాలలో నటించిన ఈమె.. 2010లో ‘కళ్యాణ్ రామ్ కత్తి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో గగనం, మిస్టర్ నూకయ్య , దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాలలో నటించింది.
Also read : RGV Saaree Movie OTT : ఓటీటీలోకి రామ్ గోపాల్ వర్మ టూ బోల్డ్ ‘శారీ’ మూవీ… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?
పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం..
ఇకపోతే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అంటూ ప్రతి భాషలో పలు చిత్రాలలో నటించి, భారీ పాపులారిటీ అందుకున్న సనా ఖాన్ 2020లో అనాస్ సయ్యద్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని, ఇండస్ట్రీకి దూరమైంది. ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఈమెకు.. ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు.