BigTV English
Advertisement

Spirit: వంగాను మెప్పించిన ఆ తమిళ హీరో ఎవరబ్బా ?

Spirit: వంగాను మెప్పించిన ఆ తమిళ  హీరో ఎవరబ్బా  ?

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ వరుస సినిమాల్లో  స్పిరిట్ ఒకటి. అనిమల్ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్ తో మరోసారి ప్రపంచాన్ని షేక్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా కోసం అనిమల్ పార్క్ కూడా పక్కన పెట్టేసి వంగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలం కావడంతో ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా ఆగస్టులో స్పిరిట్ ను పట్టాలెక్కించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.


 

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. మొదట ఈ పాత్ర కోసం దీపికా పదుకొనేను అనుకోగా ఆమె పెట్టిన కండిషన్స్ నచ్చక సందీప్ రెడ్డి వంగా త్రిప్తి దిమ్రిని ఫైనల్ చేశాడు.  అనిమల్ సినిమాతో త్రిప్తి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్  గా మారిన విషయం అందరికీ తెలిసిందే.  ఇక స్పిరిట్ కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ భారతదేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందా..?,  షూటింగ్ ఫినిష్ చేసి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.


 

ఇక మొట్టమొదటిసారి ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న స్పిరిట్ సినిమాకు సంబంధించిన  ఏ వార్త వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మొదటి నుంచి స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కు ధీటుగా ఉండే నటులనే వంగా సెలెక్ట్ చేస్తున్నాడు.  ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్పిరిట్ లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండనుందని, ఆ పాత్రలో ఒక తమిళ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తుంది. అయితే ఆ తమిళ హీరో ఎవరు అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది.

 

స్పిరిట్ లో ఆ పాత్ర చాలా ముఖ్యమైనదని, కచ్చితంగా ఒక స్టార్ హీరో చేయాల్సిన పాత్ర అని చెప్పుకొస్తున్నారు. ఇక ముఖ్యమైన పాత్ర అని అంటున్నారు అంటే కచ్చితంగా స్టార్ హీరోనే తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన ఆలోచిస్తే ఆ కోలీవుడ్ హీరో ఎవరై ఉంటారు అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.  స్టార్ హీరోనా..  కుర్ర హీరోనా లేక కొత్త హీరోనా అనేది అంతుచిక్కడం లేదు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా మొత్తం పాన్ ఇండియా సినిమాగా ఇండస్ట్రీ మారింది.

 

తమిళ్,  తెలుగు నటీనటులు కలిసి సినిమాలు చేస్తున్నారు. దీనివలన అన్ని ఇండస్ట్రీలో ఆ సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. అందుకే డైరెక్టర్స్ కూడా పాన్ ఇండియా సినిమా అనగానే ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో నటుడును రంగంలోకి దింపుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్లో చాలామంది స్టార్ హీరోస్ తెలుగులో మంచి విజయాలను అందుకుంటున్నారు. వంగా కూడా తెలుగువారికి సుపరిచితుడుగా ఉన్న నటుడునే ఎంపిక చేసినట్లు సమాచారం. మరి వంగా దర్శకత్వంలో ప్రభాస్ సినిమాలో నటించే ఆ లక్కీ ఛాన్స్ పట్టేసిన హీరో ఎవరు.. ?  వంగాను అంతగా మెప్పించిన హీరో ఎవరు..? అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

Related News

The Girlfriend Business: ముగిసిన నాన్ థియేట్రికల్ బిజినెస్.. రష్మిక కెరియర్ లోనే భారీ ధర!

Nagarjuna 100: నాగ్ సరసన ముగ్గురు బ్యూటీలు.. మన్మధుడు అనిపించుకున్నాడుగా!

Ramya Krishna: ఆర్జీవీ సినిమాలో ‘శివగామి’ రమ్యకృష్ణ కీ రోల్..!

Rashmika: తెలంగాణ యాసతో అదరగొట్టిన రష్మిక.. రౌడీ హీరో బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్లున్నాడే

Singer Chinmayi: జానీ మాస్టర్ కి ఛాన్స్.. లైంగిక వేధింపులను ప్రోత్సహించడమే

Shahrukh Khan: షారుక్ ఫ్యాన్స్ కి ఘోర అవమానం.. సిబ్బందిపై మండిపడ్డ కింగ్!

Rajendra Prasad: ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతున్నావ్ నటకిరీటి..

Mass Jathara: మాస్ జాతర 2 డేస్ కలెక్షన్స్.. అసలు ఏంటీ దారుణం?

Big Stories

×