BigTV English

Ravi Teja : ఇప్పుడేం చేయాలి… నిర్మాతకు తలనొప్పిగా మారిన రవితేజ

Ravi Teja : ఇప్పుడేం చేయాలి… నిర్మాతకు తలనొప్పిగా మారిన రవితేజ

Ravi Teja New Movie : ఇప్పుడు స్టార్ హీరోలు ఒక్క సినిమా చేయడానికి కనీసం రెండు నుంచి మూడేళ్లు టైం తీసుకుంటున్నారు. దీని వల్లే ఇండస్ట్రీలో ఇప్పుడున్న సమస్యలు అని క్రిటిక్స్ అంటుంటారు. స్టార్ హీరో ఏడాదికి ఒక్క సినిమా చొప్పున చేస్తే ఇండస్ట్రీ బాగు పడుతుంది. దీన్ని పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతుందన్న హీరో అంటే ఒకే ఒక్కడు. అతనే రవితేజ. ఏడాదికి కనీసం రెండు సినిమాలైన రిలీజ్ అయ్యేలా చూస్తాడు. ఫలితం గురించి పక్కన పెడితే సినిమాలు మాత్రం పక్కా రిలీజ్ అవుతాయి.


గతేడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది మాస్ జాతర సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాత నాగ వంశీకి ఓ తలనొప్పిగా ఉందట. దీనికి కారణం మాస్ మహారాజ రవితేజనే అని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

రవితేజ రైల్వే పోలీస్ పాత్రలో చేస్తున్న మూవీ మాస్ జాతర. దీనికి భాను భోగవరుపు డైరెక్టర్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.


నిజానికి ఈ మూవీ మే నెలలోనే విడుదల కావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల అది రిలీజ్ కాలేకపోయింది. ఆగష్టు 27న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ డేట్ నుంచి కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ – ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి.

అవే బ్యానర్స్‌లో కింగ్‌డం అనే మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబోలో ఈ మూవీ వస్తుంది. ఇది కూడా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు జూలై 25 ఆల్మోస్ట్ ఫిక్స్ అనే వార్త వినిపిస్తుంది. అయితే జూలై 24న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు కూడా వస్తుంది. పవన్ సినిమా వస్తే, నాగ వంశీ తన సినిమాను రిలీజ్ చేయలేడు.

అదే జరిగితే, జూలై 25న కింగ్‌డం రాకపోవచ్చు. అప్పుడు అల్టర్‌నేటివ్ డేట్ ఆగష్టు 1. ఈ డేట్ ఫిక్స్ అయితే, ఒకే నెలలో ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు రావడం కొంచెం కష్టం అవుతుంది. బిజినెస్, బయ్యర్లు, థియేటర్లు ఇలా కొన్ని సమస్యలు రావొచ్చు. పైగా కింగ్ డం భారీ బడ్జెట్ మూవీ. అలాగే సినిమా అంచనాలెన్నో ఉన్నాయి.

దీంతో, ఆగష్టు 1కి ఈ కింగ్‌డంను రిలీజ్ చేయాల్సి వస్తే ఆగష్టు 27న రిలీజ్ కావాల్సిన మాస్ జాతరను వాయిదా వెద్దామని రవి తేజ‌తో నిర్మాత నాగ వంశీ అన్నాడట. దీనికి మాస్ మహారాజ రవి తేజ ఒప్పుకోలేదట. ఏది ఏమైనా… అనుకునే డేట్‌కే సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతతో చెప్పేశాడట. దీంతో ఇప్పుడేం చేయ్యాలి అంటూ నాగ వంశీ తల పట్టుకుంటున్నట్టు సమాచారం.

ఒకే నెలలో రెండు సినిమాలు రిలీజ్ చేస్తే, కింగ్‌డం లాంటి భారీ బడ్జెట్ మూవీ బిజినెస్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అలా అని కింగ్‌డంను వాయిదా వేయలేని పరిస్థితి. ఎందుకంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ తీసుకున్న నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇప్పటికే ఒత్తడి ఉంది. ఇలాంటి టైంలో నాగ వంశీకి ఏం చేయాలో అర్థమవ్వడం లేదట.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×