Pawan Kalyan :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విడుదల చేయబోతున్న తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’ (HHVM) జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుంచి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కోటా శ్రీనివాసరావు (Kota Srinivas Rao) కు చివరి సినిమా అయినా.. ఈ సినిమా కోసం ఆయనకు ఎంత పారితోషికం ఇచ్చారు అనే వార్త తెరపైకి వచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కోటా శ్రీనివాసరావును మళ్ళీ తెరపై చూడాలనుకున్న అభిమానులు..
దిగ్గజ లెజెండ్రీ నటుడిగా పేరు సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావు వయసు మీద పడడంతో అనారోగ్య సమస్యల కారణంగా తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. ముఖ్యంగా ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు అనేది మాత్రం వాస్తవమని చెప్పవచ్చు. ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా.. విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు.. ఇక వయసు మీద పడడంతో ఇండస్ట్రీకి దూరమైన కోట శ్రీనివాసరావు మళ్ళీ తెరపై చూడలేమని అనుకున్న వారు ఎంతోమంది. కానీ ఒక్క పాత్రలోనైనా ఆయన నటిస్తే చూడాలని కోరుకునే అభిమానులు కూడా చాలామంది ఉన్నారు.
హరిహర వీరమల్లు కోటా చివరి సినిమా..
ఇక వయసు మీద పడడంతో అవకాశాలు లేక ఇంట్లో ఖాళీగా కూర్చువడం వల్ల బోర్ కొట్టడంతో పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి మరీ హరిహర వీరమల్లు సినిమాలో ఒక చిన్న పాత్రలో అవకాశం అందుకున్నారు. అయితే ఇదే ఆయన చివరి చిత్రం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో కోటా శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం చేస్తే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోటా శ్రీనివాసరావుకి చివరి సినిమా కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావుకి వయసు మీద పడడంతో పెద్దగా కథను ప్రభావితం చేసే క్యారెక్టర్ పడి ఉండకపోవచ్చు. కానీ రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే ఇచ్చినట్లు సమాచారం..
చివరి సినిమా కోసం కోటా శ్రీనివాసరావు రెమ్యూనరేషన్ ఎంతంటే?
అయితే ఈ సినిమా కోసం ఆయన కేవలం ఐదు రోజులు మాత్రమే కాల్ షీట్స్ ఇచ్చారట. అందుకు గానూ నిర్మాత ఏ.ఏం.రత్నం సుమారుగా 4లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అంటే రోజుకి లక్ష రూపాయలు చొప్పున తీసుకున్నారుట. ఇకపోతే ఇదే కోటా శ్రీనివాసరావు చివరి రెమ్యూనరేషన్ కూడా .. ఏది ఏమైనా తన నాలుగు దశాబ్దాల సినీ కెరియర్ లో 750కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించినా. ఎక్కువగా బాబు మోహన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 60 కి పైగా చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడం ఒక గొప్ప విషయమని చెప్పవచ్చు.
ALSO READ:Lokesh Kanagaraj: కూలీ ట్రైలర్ డేట్ లాక్.. ఒక్కమాటతో సినిమాపై అంచనాలు పెంచేసిన డైరెక్టర్!