BigTV English

Poori laddu: మిగిలిపోయిన పూరీలతో ఇలా టేస్టీ లడ్డూ చేసేయండి, రెసిపి తెలుసుకోండి

Poori laddu: మిగిలిపోయిన పూరీలతో ఇలా టేస్టీ లడ్డూ చేసేయండి, రెసిపి తెలుసుకోండి

ఎప్పుడూ ఒకేలాంటి లడ్డూ తింటే కొత్తదనం ఏముంటుంది? ఒకసారి పూరీ లడ్డు ట్రై చేయండి. ఇంట్లో పూరీలు మిగిలిపోయినప్పుడు ఈ లడ్డులను చేయవచ్చు. లేదా ప్రత్యేకంగా పూరీలను చేసి కూడా ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇక పూరీ లడ్డు ఎలా చేయాలో తెలుసుకోండి.


పూరి లడ్డు రెసిపీకి కావలసిన పదార్థాలు
మైదా – ఒక కప్పు
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
నీళ్లు – తగినన్ని
యాలకుల పొడి – అర స్పూను
నెయ్యి – రెండు మూడు స్పూన్లు
బెల్లం తురుము – అరకప్పు

పూరీ లడ్డు రెసిపీ
1. పూరి లడ్డు చేయడానికి ముందుగా మనం పూరీలను రెడీ చేసుకోవాలి.
2. ఇందుకోసం మీరు ఒక ప్లేట్లో మైదాను వేయాలి.
3. అందులో చిటికెడు ఉప్పు వేసి నీళ్లు పోసి మెత్తగా పిండిలాగా కలుపుకోవాలి.
4. దీన్ని పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి.
5. తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పూరీల్లాగా వత్తాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. ఆ నూనె వేడెక్కాక ఈ పూరీలను వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు పూరీలను చల్లార్చి దాన్ని చేత్తోనే నలిపి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి.
8. ఇప్పుడు ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి బెల్లం నీళ్లు పోసి వేడి చేయాలి.
9. అందులోనే యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి.10. బెల్లం పాకంలాగా వచ్చినప్పుడు ఈ పక్కన పెట్టుకున్నా పూరి ముక్కల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
11. దీన్ని దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
12. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తోనే కొంత మిశ్రమాన్ని తీసి లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే పూరి లడ్డు రెడీ అయినట్టే.
13. ఇది తిన్నారంటే ఎంతో రుచిగా ఉంటుంది. పాకంలో నెయ్యి వేయడం మాత్రం మర్చిపోకండి. లడ్డుకి మంచి ఫ్లేవర్ ఇవ్వడానికి నెయ్యి ఉపయోగపడుతుంది.


మీకు బెల్లం నచ్చకపోతే పంచదారను వేసుకోవచ్చు. కానీ ఆరోగ్యపరంగా చూస్తే పంచదార కన్నా బెల్లం మంచిది. అందుకే మేము ఇక్కడ బెల్లం రెసిపీనే చెప్పాము. అలాగే పాకంలో జీడిపప్పు తురుము, బాదం పప్పు తురుము వంటివి వేస్తే ఇంకా మంచిది. రుచి అద్భుతంగా వస్తుంది. వీటిని అతిధులకు వడ్డిస్తే వారు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ పూరీ లడ్డు చేసేందుకు ప్రయత్నించండి.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×