Best Waterproof Phones Under 20000: మొబైల్ ఫోన్ కొనాలనుకున్నప్పుడు.. ప్రతి ఒక్కరూ కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్‌తో.. పాటు దాని క్వాలిటీని కూడా ప్రధానంగా చూస్తారు. ముఖ్యంగా వర్షాకాలంలో.. లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫోన్ తడిచి పోతుందనే భయం చాలా మందిలో ఉంటుంది. ఈ టెన్షన్‌ను పూర్తిగా పోగొట్టడానికి.. మార్కెట్లో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ (IP67 లేదా IP68 రేటింగ్) కలిగిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా కేవలం రూ.20,000 లోపు ధరలో లభించే టాప్ 6 వాటర్‌ప్రూఫ్ ఫోన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మోటోరోలా బ్రాండ్ నుంచి బడ్జెట్ ధరలో లభించే.. కొన్ని మోడల్స్ అద్భుతమైన IP రేటింగ్‌తో వస్తున్నాయి. ఈ ఫోన్లు .. కేవలం వాటర్‌ప్రూఫ్ మాత్రమే కాకుండా, స్టైలిష్ డిజైన్ , క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తాయి. వర్షంలో తడిచినా ఎలాంటి సమస్య లేకుండా పని చేసే శక్తి దీని సొంతం.
సామ్‌సంగ్ నమ్మకానికి మారుపేరు. ఈ బ్రాండ్ నుంచి రూ. 20వేలలోపు లభించే కొన్ని స్మార్ట్ ఫోన్లు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తున్నాయి. బ్రాండ్ వాల్యూ కోరుకునే వారికి.. లాంగ్ లాస్టింగ్ పెర్ఫార్మెన్స్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో.. పాటు మెరుగైన కెమెరా క్వాలిటీ దీని ప్రత్యేకత.
యూత్ లో విపరీతమైన .. క్రేజ్ ఉన్న ఒప్పో , రియల్‌మీ బ్రాండ్లు ఇప్పుడు బడ్జెట్ రేంజ్‌లోనే స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్లను ఇస్తున్నాయి. ఫోన్ సడన్‌గా.. నీళ్లలో పడినా లేదా నీటి తుంపర్లు పడినా తట్టుకునేలా.. వీటిని డిజైన్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ , గేమింగ్ లవర్స్‌కు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.
4. పోకో ,రెడ్‌మి డివైజెల్స్ :
తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లు కోరుకునే.. వారికి పోకో, రెడ్‌మి ఫోన్లు ఎప్పుడూ ముందే ఉంటాయి. ఈ బ్రాండ్ల నుంచి వచ్చే కొన్ని లేటెస్ట్ మిడ్-రేంజ్ ఫోన్లు డస్ట్ , వాటర్ స్ప్లాష్ ప్రొటెక్షన్‌తో వస్తున్నాయి. రోజు వారీ వాడకంలో.. ఎదురయ్యే చిన్నపాటి నీటి ప్రమాదాలకు కూడా ఇవి పాడు కాకుండా ఉంటాయి.
Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!
IP రేటింగ్: ఫోన్ కొనేముందు దాని IP67 లేదా IP68 రేటింగ్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఇది నీరు, దుమ్ము నుంచి ఫోన్‌ను ఎంతవరకు రక్షిస్తుందో చెబుతుంది.
వారంటీ పాలసీ: వాటర్‌ప్రూఫ్ ఫోన్ అయినప్పటికీ.. వాటర్ డ్యామేజ్ కంపెనీ వారంటీ కింద కవర్ అవుతుందా లేదా అనేది ఒకసారి సర్వీస్ సెంటర్‌లో లేదా ఆన్ లైన్ వివరాల్లో స్పష్టంగా చెక్ చేసుకోవడం మంచిది.
రూ. 20,000 లోపు బడ్జెట్‌లో ఇప్పుడు అద్భుతమైన వాటర్ ప్రూఫ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా మీ మొబైల్ నీరు లేదా దుమ్ము వల్ల పాడవకుండా సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే.. మంచి IP రేటింగ్ ఉన్న ఈ బడ్జెట్ ఫోన్లను కొనండి.