E-Paper
Advertisement

‘కొబ్బరి మట్ట’ సంపూ కాదు.. ‘ది ప్యారడైజ్’లో కొత్త సంపూని చూస్తారట!

‘కొబ్బరి మట్ట’ సంపూ కాదు.. ‘ది ప్యారడైజ్’లో కొత్త సంపూని చూస్తారట!
Advertisement

Sampoornesh Babu:సంపూర్నేష్ బాబు ..హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ క్రేజీ కమెడియన్ అప్పట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.ఇక ఆ తర్వాత వచ్చిన కొబ్బరి మట్ట సినిమా కూడా మంచి పేరే తెచ్చుకోవడంతో ఆ తర్వాత చాలా సినిమాలే క్యూ కట్టాయి.

అయితే ఆ సినిమాలేవీ అనుకునంతగా ఆడకపోవడంతో కాస్త స్లో అయిన సంపూ ఇపుడు సరికొత్త పాత్రలో ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయిపోయాడు.శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో ప్యారడైజ్ సినిమాలో బిర్యానీ అనే పాత్రలో నటిస్తున్నాడు.ఎప్పుడూ కామెడీ రోల్స్ చేసిన సంపూ ఇపుడు సీరియస్ రోల్ చేస్తుండటంతో సంపూ ఆ రోల్ ఎలా చేసి ఉంటాడా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నరంతా.

Advertisement

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ కాబోతున్న సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపూ ప్యారడైజ్ సినిమాగురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

నాని ప్రయోగాలు ఇష్టం 

Advertisement

సంపూ మాట్లాడుతూ తనకు నాని అంటే చాలా ఇష్టమని నాని సినిమాలను తాను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నానని అన్నారు. ముఖ్యంగా నటుడిగా నాని చేసే ప్రయోగాలు తనకు నచ్చుతాయని చెప్పారు.ఇక తను కామెడీ సినిమాలతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకి అన్ని రకాల సినిమాల్లో నటించాలన్న కోరిక ఉందని తెలిపాడు.

ఇక ఇదే సమయంలో ‘ది ప్యారడైజ్’లో తనకు వచ్చిన పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు సంపూ.ఈ సినిమా కోసం తనను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎంతో ప్రిపేర్ చేశాడని,ఈ పాత్రలో ఒదిగిపోయేందుకు శ్రీకాంత్ చెప్పిన విషయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపాడు.ఇక తాను ఇప్పటి వరకి చేసిన పాత్రలకి భిన్నంగా ఈ బిర్యాని పాత్ర ఉండబోతుందని పేర్కొన్నాడు.

శ్రీకాంత్ కి ఉన్న కన్విక్షన్ వేరే 

ఇక శ్రీకాంత్ ఓదెల గురించి మాట్లాడుతూ.. ఆయనకు పాత్రల విషయంలో చాలా క్లారిటీ ఉంటుందని ,ఒక సీన్‌ను ఎలా తీయాలి, నటుడి నుంచి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ రావాలి అనే విషయాల్లో శ్రీకాంత్ కి ఉన్న కన్విక్షన్ చాలా తక్కువ మందిలో ఉంటుందని అన్నాడు.ఇక ‘దసరా’లో శ్రీకాంత్ ఓదెల డిజైన్ చేసిన రోల్స్ కాని, వాటి డిజైన్ కాని తనకెంతో నచ్చాయని ది ప్యారడైజ్’లో క్యారెక్టర్స్ కూడా అదే స్థాయిలో రోల్స్ డిజైన్ చేశాడని మనసులోని మాటని చెప్పుకొచ్చాడు.

ఇక నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై మాట్లాడుతూ నాని తన పాత్రని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో దర్శకుడిగా శ్రీకాంత్ ప్రతి సన్నివేశాన్ని ఎంత పర్ఫెక్షన్‌తో తెరకెక్కించాలనుకుంటారో దగ్గరగా చూసినట్లు చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్ సినిమాకు మెయిన్ ఎసెట్ గా నిలవడం పక్కా అని ఆశా భావం వ్యక్తం చేశాడు.

నాని కెరీర్‌లో మరో డిఫరెంట్ ప్రాజెక్ట్‌

తన కెరీర్‌లో చేసిన పాత్రలను గుర్తుచేసుకుంటూ.. ఒక్కో సినిమా తనకు ఒక్కో పాఠం నేర్పిందని సంపూర్ణేష్ బాబు తెలిపారు. మొదట్లో కామెడీ పాత్రలతో గుర్తింపు వచ్చినా, ఇప్పుడు వేరే తరహా క్యారెక్టర్లు కూడా చేయాలనే ఆసక్తి ఉందని చెప్పారు. నటుడిగా ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకోవాలని, ఒకే ఇమేజ్‌లో చిక్కుకుపోకూడదని భావిస్తున్నట్లు తెలిపారు.

‘ది ప్యారడైజ్’ విషయానికి వస్తే.. ఈ సినిమా నాని కెరీర్‌లో మరో డిఫరెంట్ ప్రాజెక్ట్‌గా నిలవబోతున్నట్లు ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

ALSO READ:‘ఇంత ఖాళీగా ఉన్నారా?’.. ట్రోలర్స్‌పై తనూజ ఫైర్

ఇలాంటి సమయంలో సంపూర్ణేష్ బాబు కూడా సీరియస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారనే విషయం బయటకు రావడంతో సంపూ ఎలా కనిపిస్తాడా అంటూ క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.మొత్తానికి కామెడీతో నవ్వించిన సంపూర్ణేష్ బాబు.. ఇప్పుడు సీరియస్ యాక్టర్‌గా ఎంతవరకు మెప్పిస్తారనేది సెప్టెంబర్ 24న తేలిపోనుంది.

Tags

Related News

భూ కబ్జా వ్యవహారం.. నిర్మాత సి కళ్యాణ్ పై పోలీస్ కేసు నమోదు!

విడాకుల వ్యవహారంపై స్పందించిన నీతి టేలర్.. అంత మాట అన్నారేంటి?

‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్ కోసం కయాదు లోహర్ కొత్త స్ట్రాటజీ.. ఫొటోస్ వైరల్!

రోజాకు ఇష్టమైన పొలిటీషియన్ తనేనా.. జగన్ కాదా? ఇదేమీ ట్విస్ట్ రా బాబు!

‘ఇంత ఖాళీగా ఉన్నారా?’.. ట్రోలర్స్‌పై తనూజ ఫైర్

డైరెక్టర్ సెల్వాతో రోజా లవ్..చిరంజీవి అంత మాట అన్నారా?

బాడీ షేమింగ్ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కత్రినా కైఫ్!

Big Stories

Advertisement
×