BigTV English

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Lavanya – Raj Tarun:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో.. ఇటు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన విషయం రాజ్ తరుణ్ (Raj Tarun), లావణ్య(Lavanya )కేస్.. రాజ్ తరుణ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని, గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడు అని.. ఇప్పుడు ఇద్దరం కలిసి ఇల్లు కొంటే, తనకు తెలియకుండా ఆ ఇల్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని కోర్టు మెట్లు ఎక్కింది లావణ్య. అయితే ఆధారాలు లేకుండా ఆ ఇల్లు లావణ్యదే అని ప్రూవ్ చేయడం అసాధ్యం అంటూ కోర్టు తీర్పునిచ్చినా.. మళ్ళీ ఇదే ఇంటి గొడవపై ఇప్పుడు మరొకసారి రాజ్ తరుణ్ పై కేసు పెట్టి వార్తల్లో నిలిచింది.


రాజు తరుణ్ పై మళ్లీ కేసు పెట్టిన లావణ్య..

తాజాగా బుధవారం (సెప్టెంబర్ 3) అతడిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మరో కొత్త కేసు నమోదు అయ్యింది.. జూన్ 30వ తేదీన రాజ్ తరుణ్, అతడి సహచరులు తనను తన కుటుంబాన్ని బెదిరించారు అని తన వాంగ్మూలంలో పేర్కొంది లావణ్య. అంతేకాదు తన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని.. అడ్డుకోవడంతో తన తండ్రిపై కూడా దాడి చేశారని, తన పెంపుడు కుక్కను కూడా చంపారు అని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదు మొదట హైదరాబాదు పోలీస్ కమిషనర్ కి చేరడంతో ఆయన ఆదేశాల మేరకు నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ తో పాటు రాజశేఖర్, సుశీ, అంకిత్ గౌడ్ , మణికంఠ, రవితేజాలపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఏ త్రీ గా శేఖర్ భాషా పేరును కూడా ఈమె మెన్షన్ చేసింది. అతడు నేరుగా అక్కడికి రాకపోయినా అతడి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఆరోపించింది లావణ్య.

శేఖర్ భాషను కలుద్దామన్న లావణ్య


ఈ క్రమంలోనే తాజాగా శేఖర్ భాష బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన లైవ్ డిబేట్లో లావణ్య ఫోన్ కాల్ లో మాట్లాడి, ఈ విషయంపై మరొకసారి స్పందించింది ..2016లో రాజ్ తరుణ్ తో కలిసి కోకాపేటలో ఒక విల్లాను కొనుగోలు చేసిందట లావణ్య . కానీ వ్యక్తిగత కారణాలవల్ల 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని కాళీ చేశాడని, ప్రస్తుతం తాను మాత్రమే ఉంటున్నానని లావణ్య తెలిపింది. అయితే ఇప్పుడు ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలి అని కొంతమంది తనపై దాడి చేస్తున్నారని ఆరోపించింది. ఇక ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ.. ఇల్లు ఖాళీ చేయమని శేఖర్ భాష నాతో అన్నారు . అయినా ఆయనకు ఏం హక్కు ఉంది? నన్ను అనడానికి.. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే కదా.. రాజ్ తరుణ్ తో నేను నాలుగు గోడల మధ్య గొడవపడ్డాను. కానీ ఆయన ఎవరు నాపై విరుచుకుపడడానికి.. ఒకసారి నేను ఆయనను కలుద్దామని, నా వైపు వెర్షన్ కూడా వినమని చెప్పాను. కానీ ఆయన నన్ను బూతులు తిడుతూ రెచ్చిపోయారు. అసలు ఆ ఇంట్లో ఉండడానికి నీకేం హక్కు ఉందని నన్ను అన్నారు. అసలు నన్ను అనే హక్కు ఆయనకు ఎవరిచ్చారు” అంటూ లావణ్య మండిపడింది. అటు శేఖర్ భాషా కూడా లావణ్యను ఇల్లు ఖాళీ చేయమని చెప్పినట్లు ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ మొత్తానికి అయితే మళ్లీ వార్తల్లో నిలిచింది లావణ్య. మొత్తానికి అయితే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక అమ్మాయిపై ఎందుకు ఇలా కక్ష కట్టారు అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది ఇలాంటి ఆడవాళ్ళతో జాగ్రత్త అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.

ALSO RAED:Kalyani Priyadarshan: అందుకే తెలుగు సినిమాలు చేయట్లేదు.. హీరోయిన్ క్లారిటీ!

Related News

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Balakrishna: అఖండ 2 రిలీజ్ పై బాలయ్య క్లారిటీ.. సోషల్ మీడియాపై మండిపాటు!

OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు

Prabhas: ప్రభాస్‌కి ఏం తెలీదు… డార్లింగ్‌ను తేజ సజ్జా అలా అన్నాడేంటి ?

Big Stories

×