OG Movie : కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా ఓ జి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్న స్ట్రైట్ ఫిలిం ఇది. అలానే రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా కూడా స్ట్రైట్ ఫిలిం. అయితే కర్ణుడు చావుకి 100 కారణాలు అని చెప్పినట్లు ఆ సినిమా ఫెయిల్యూర్ కి చాలా కారణాలు ఉన్నాయి. చాలా ఉత్సాహంతో దర్శకుడు క్రిష్ ఒక కథతో పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చాడు.
మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ పరిస్థితుల్లో బిజీ అయిపోవడం వలన సినిమాలు మీద ఏకాగ్రత తగ్గించాడు. ఆ తరుణంలో ఏం చేయాలో తెలియని క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేసాడు. ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత దానిని జ్యోతి కృష్ణ టేకప్ చేశాడు. ఇక సినిమా ఫలితం గురించి అందరికీ తెలిసిందే. అందుకే అందరి దృష్టి కూడా ఓజీ పైన ఉంది. ఓజి నుంచి విడుదలైన కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఓ జి విధ్వంసం సృష్టిస్తుంది.
ఓ జి సినిమాకి సంబంధించి యూఎస్ లో జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే మతి చెదిరిపోతుందని చెప్పాలి. ఇది కదా పవన్ కళ్యాణ్ అసలైన స్టామినా అని ఇప్పుడిప్పుడే చాలామందికి అర్థమవుతుంది. ఓజి సినిమాకు సంబంధించి 21 రోజుల ముందు.. 31,300 టికెట్స్ బుక్ అయ్యాయి. దీని నుంచి వచ్చిన కలెక్షన్లు దాదాపు 1M వరకు ఉన్నాయి. యుఎస్ లో వన్ మిలియన్ కొట్టడం అనేది చాలామందికి టార్గెట్.
కానీ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు అలవోకగా దాన్ని బీట్ చేసింది. పవన్ కళ్యాణ్ స్టామినా ఇది అని మరోసారి అందరికీ గుర్తు చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తున్నారు.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆకలితో ఉన్నారు. వాళ్లు ప్రాపర్ హిట్ సినిమా చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. కొన్ని సినిమాలు వచ్చాయి కానీ అవి రీమేక్, ఊహించిన స్థాయిలో ఆడలేదు. సినిమాకు సంబంధించి సరైన టికెట్ రేట్లు లేవు. అయితే ఇప్పుడు ఓ జి సినిమాకి సంబంధించి అన్ని విపరీతంగా కలిసి వస్తున్నాయి.
అన్నిటిని మించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికే సుజిత్ కి భారీ ఎలివేషన్ ఇస్తున్నారు. సుజీత్ సంభవం అంటూ ఇప్పటికే వీడియో ఎడిట్స్ కూడా చేస్తున్నారు. సినిమా కొంచెం పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అయిపోతే, కొత్త రికార్డ్స్ క్రియేట్ అయినట్లే. ఏం జరుగుతుందో సెప్టెంబర్ 25న తెలుస్తుంది.
Also Read: Prabhas: ప్రభాస్‌కి ఏం తెలీదు… డార్లింగ్‌ను తేజ సజ్జా అలా అన్నాడేంటి ?