Kalyani Priyadarshan: సాధారణంగా టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కంటే మిగతా భాషల హీరోయిన్స్ ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో బెంగళూరు బ్యూటీస్ ఎంత పాపులారిటీ అయితే అందుకున్నారో.. , ఇప్పుడు మలయాళీ బ్యూటీస్ కూడా తెలుగులో అంతే పేరు సొంతం చేసుకున్నారు. తమ అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మలు అటు భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. అలా మాలీవుడ్ నుండి వచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)కూడా ఒకరు .
నిజానికి చాలామంది మాలీవుడ్ హీరోయిన్స్ ఇక్కడ నేరుగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తుంటే.. కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం డబ్బింగ్ చిత్రాలతోనే సరిపెట్టుకుంటుంది. వాస్తవానికి అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా వచ్చిన ‘హలో’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత రణరంగం, చిత్రలహరి వంటి సినిమాలు చేసింది. కానీ ఈ చిత్రాలు ఈయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. అందుకే తమిళ్, మలయాళం చిత్రాలపై ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తాజాగా దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) నిర్మాతగా, నస్లెన్ హీరోగా నటించిన ‘కొత్తలోక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా.. అందులో ఆమె మాట్లాడుతూ తెలుగు చిత్రాలలో చేయకపోవడం పై స్పందించింది.
అందుకే తెలుగు సినిమాలు చేయలేదు – కళ్యాణి ప్రియదర్శన్
సక్సెస్ మీట్ లో భాగంగా కళ్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ..” నాపై ప్రేమ చూపించింది తెలుగు ప్రజలే. వారి ప్రేమను నేనెప్పుడూ మరిచిపోలేను. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ మిమ్మల్ని కలవడం, మీ ప్రేమ పొందడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా తెలుగులో సినిమాలు చేయాలని ఉంది. కానీ సరైన కథలు రావడం లేదు. ఒకవేళ నేను అనుకున్న కథలు కనుక నాకు తగిలితే కచ్చితంగా తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తాను” అంటూ క్లారిటీ ఇచ్చింది.
త్వరలో మీ ముందుకు వస్తాను – కళ్యాణి ప్రియదర్శన్
అంతేకాదు” కొత్తలోక సినిమాని కూడా తెలుగు సినిమాలాగే భావించి ఆదరిస్తున్నారని, మీరు చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని , మీ మద్దతుతో ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు ముందు ముందు చేయాలని కోరుకుంటున్నాను. త్వరలోనే కథ నచ్చితే కచ్చితంగా సినిమా చేస్తాను” అని చెప్పుకొచ్చింది కళ్యాణి ప్రియదర్శన్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తెలుగులో లాభాల బాట పట్టిన కొత్తలోక..
కొత్తలోక మూవీ విషయానికి వస్తే.. నస్లెన్, కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో కొత్తలోక చాప్టర్ వన్ చంద్ర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 29న విడుదలైన ఈ సినిమా తెలుగు వెర్షన్ మార్నింగ్ షోలు మిస్ అవ్వడంతో ఈవినింగ్ షో లతో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో రూ.2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. నాలుగు రోజుల్లోనే రూ.2.6 కోట్ల షేర్ రాబట్టి..ప్రస్తుతం పదిలక్షల లాభంతో దూసుకుపోతోంది.
ALSO READ:Bigg Boss AgniPariksha: ఆదిరెడ్డి రివ్యూపై శ్రీజ దమ్ము రియాక్షన్.. ఇకనైనా మారండయ్యా!