Lavanya Tripati: నేడు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కూడా వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా సెలబ్రిటీలు వారి వినాయక చవితి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయటంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripati)సైతం తన ఇంట్లో వినాయక చవితి(Vinayaka Chavithi) వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
లావణ్య బేబీ బంప్..
వినాయకుడి మండపాన్ని ఎంతో అందంగా అలంకరించి పూజ నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ ఫోటోలలో లావణ్య త్రిపాఠితో పాటు వరుణ్ తేజ్ (Varun Tej)కూడా ఉండటం విశేషం. ఇక లావణ్య త్రిపాఠి బేబీ బంప్(Baby Bump) తో కనిపించడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ తో ఉన్న లావణ్య త్రిపాఠి తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలను ఎక్కడ అభిమానులతో పంచుకోలేదు. ఈ క్రమంలోనే తన బేబీ బంప్ ఫోటో వైరల్ అవుతుంది. గత కొన్ని నెలల క్రితం లావణ్య తన ప్రెగ్నెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే మెగా ఇంట్లో మరో బుల్లి వారసుడు లేదా వారసురాలు అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ జంటకు ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నారు.
రహస్య ప్రేమాయణం..
అతి త్వరలోనే లావణ్య త్రిపాఠి పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తెలుస్తోంది. లావణ్య, వరుణ్ తేజ్ ఇద్దరిదీ ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. అయితే వీరి ప్రేమ విషయాన్ని బయటకు చెప్పకుండా రహస్యంగా ప్రేమాయణం కొనసాగించారు. వీరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన ఈ ఇద్దరూ ఆ వార్తలను ఖండించారు కానీ ప్రేమ విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఇద్దరు నిశ్చితార్థం జరుపుకోబోతున్నట్లు అధికారికంగా వెల్లడించడమే కాకుండా వీరి వివాహం ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వివాహం తర్వాత కూడా లావణ్య త్రిపాఠి సినిమాలలో నటిస్తున్నారు, సతీ లీలావతి అనే సినిమాలో ఈమె నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత తన ప్రేగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో ప్రస్తుతం సినిమాలకు లావణ్య త్రిపాఠి దూరంగా ఉన్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈయన చివరిగా మట్కా అనే సినిమాలో నటించారు. ఇటీవల కాలంలో వరుణ్ తేజ్ విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు.
Also Read: Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్ ఆ సీన్స్ లేపేశారా.. ఇలా అయితే ఎలా జక్కన్న!