Bahubali The Epic: ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తూ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. అయితే ఈ రీ రిలీజ్ విషయంలో కూడా రాజమౌళి మరొక సరికొత్త ట్రెండ్ సృష్టించబోతున్నారని చెప్పాలి. ఇప్పటివరకు టాలీవుడ్ హీరోలు నటించడం ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన బాహుబలి సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది.
బాహుబలి ది ఎపిక్..
ఇక ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరిగి మరోసారి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అయితే బాహుబలి రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ (Bahubali The Epic)అనే పేరుతో ఓకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా రెండు భాగాలను కలిపి ఒకే భాగంగా తీసుకురావాలి అంటే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా పనులలోనే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇటీవల రాజమౌళి హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాగజైన్ ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
కన్నా నిదురించరా పాట ఉండదా?
ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాజమౌళి బాహుబలి గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా రీకట్ విషయంలో తాము కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. కొన్ని అదనపు సన్నివేశాలను జోడించడంతో పాటు కొన్ని సన్నివేశాలను తొలగించినట్లు రాజమౌళి తెలియచేశారు.బాహుబలి: ది కన్‌క్లూజన్‌లోని అనుష్క ప్రభాస్ మధ్య వచ్చే కన్న నిధురించారా పాట అలాగే బాహుబలి: ది బిగినింగ్‌లోని ప్రభాస్ తమన్నా మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నీ వేషాలు బాహుబలి ది ఎ పిక్ ఫైనల్ కట్ లో ఉండదని అభిమానులు గుర్తించాలి అంటూ జక్కన్న తెలియజేశారు.
కొత్త సన్నివేశాలను జోడించబోతున్నారా?
బాహుబలి ది ఎపిక్ లో ఈ రెండు సన్నివేశాలను వదిలేయడం అనేది నాతో పాటు నా బృందం తీసుకోవాల్సిన అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఇదొకటి అంటూ రాజమౌళి ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే బాహుబలి ది బిగినింగ్ లో ప్రభాస్ తమన్నా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం వాటిని తొలగించబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు ఇదేంటి జక్కన్న ఇలా చేసావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాలో ఇంకా ఎలాంటి సన్నివేశాలను తొలగిస్తారు? ఎలాంటి సన్నివేశాలను జోడిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక బాహుబలి ది ఎపిక్ కి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Also Read: Pushpa 2 Style Ganesh: ఇదెక్కడి మాస్ క్రేజ్ రా బాబు…పుష్ప 2 స్టైల్ లో వినాయకుడు!