E-Paper
Advertisement

IBomma Ravi: ఐ బొమ్మ రవి కోసం రంగంలోకి వకీల్ సాబ్… నేనున్నానంటూ భరోసా?

IBomma Ravi: ఐ బొమ్మ రవి కోసం రంగంలోకి వకీల్ సాబ్… నేనున్నానంటూ భరోసా?
Advertisement

IBomma Ravi: మూవీ పైరసీ కింగ్ ఐ బొమ్మ రవి (Ibomma Ravi)ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఈయన పెద్ద ఎత్తున సినిమాలను పైరసీకి గురి చేస్తూ భారీగా సొమ్ము చేసుకున్నారు ఈయన పైరసీ ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయికి కూడా చేరుకుంది అంటే ఏ స్థాయిలో ఈయన సినిమాలను పైరసీ చేశారో స్పష్టమవుతుంది. గత కొద్ది రోజులుగా పోలీసులు పైరసీని అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఐ బొమ్మపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పోలీసులు పక్కా పథకం ప్రకారం ఈయన కదలికలను గుర్తిస్తూ కస్టడీలోకి తీసుకున్నారు.

రవి కేసును వాదించబోతున్న లాయర్ సలీం..

ప్రస్తుతం ఐ బొమ్మ రవి చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. 14 రోజులపాటు రవికి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఇలా ఈయన అరెస్టు కావడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోగా సోషల్ మీడియా వేదికగా రవికి మద్దతుగా పెద్ద ఎత్తున పోస్టులు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రిమాండ్ లో ఉన్న ఐ బొమ్మ రవికి పెద్ద ఎత్తున శిక్ష పడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో రవికి మద్దతుగా లాయర్ సలీం (Lawyer Saleem)రంగంలోకి దిగారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న రవి కేసును వాదించడం కోసం తనకు మద్దతుగా లాయర్ సలీం ముందుకు రావడంతో ఇది కాస్త చర్చలకు కారణమైంది.

ఫీజు మేమే చెల్లిస్తాం…

Advertisement

వ్యవస్థలకు వ్యతిరేకంగా రవి సినిమాలను పైరసీ (Movie Piracy)చేయడంతో ఆయనకు మద్దతుగా లాయర్ సలీం అండగా ఉండడం పట్ల ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. ఇక ఈ విషయంపై నెటిజన్లు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఆ దేవుడే ఇలా లాయర్ రూపంలో వచ్చారు అనిపిస్తుంది అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం డబ్బు ఎంతైనా పర్వాలేదు ఫీజు మేము ఇస్తాము కచ్చితంగా రవి బయటకు రావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో రవికి భారీ మద్దతు..

Advertisement

ఈ కేసును చాలా వ్యక్తిగతంగా తీసుకొని గట్టిగా వాదించండి సర్ రవి బయటకు రాగానే మీకు ఘనంగా సన్మానం చేస్తామంటూ నేటిజన్లు కామెంట్లు చేయడంతో రవి అరెస్టుకు ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుంది. అయితే రవికి ఈ స్థాయిలో మద్దతు రావడానికి కారణం లేకపోలేదు ఒక సినిమాకు వెళ్లి ఒక కుటుంబం మొత్తం సినిమా చూడాలి అంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిలు ఎదురయ్యాయి. ఇలాంటి తరుణంలోనే పైరసీలో సినిమాలు చూసే వెసులుబాటు రవి కల్పించడంతోనే ఈయనకు మద్దతుగా నిలుస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇలా సినిమాని పైరసీలో చూడటం ఎంతవరకు సమంజసం కాదని దాని కారణంగా చిత్ర నిర్మాతల కంటే కూడా పైరసీలో సినిమా చూసేవారే ఎక్కువగా నష్టపోతారని పోలీస్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. పైరసీలో సినిమా చూసే ప్రతి ఒక్కరి డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో ఉంటుందని ఈ డేటా ద్వారా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Shriya Saran: అది నేను కాదు…సమయం వృథా చేసుకోవద్దు…హెచ్చరించిన శ్రేయ శరణ్!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×