Little Hearts Making Video: టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి ఘాటీ మూవీకి పోటీగా ఓ చిన్న సినిమా థియేటర్లలోకి వస్తోంది. అదే లిటిల్ హార్ట్స్ చిత్రం. అదరు యువ నటీనటులే. దర్శకుడు కూడా కొత్తవాడే. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్లో ప్రముఖ నిర్మాత బన్నీవాసు, పంపిణి దారుగా పేరు తెచ్చుకున్న వంశీ నందిపాటి కలిసి రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేం మౌళి తనూజ్, శివానీ నాగారం జంటగా నటించారు.
మూవీ రిలీజ్కి ఇంకా ఒక్కరోజే ఉంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్తో మంచి బజ్ పెంచుకుంది ఈ సినిమా. తాజాగా ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలను టార్గెట్ చేసినట్టుగా ఉంది. వీడియో మొత్తం సటైరికల్ సాగింది. ఇది చూసి సినిమా ఏమో కానీ, ఈ వీడియో చూస్తూ మొత్తం ఎంజాయ్ చేశామంటున్నారు నెటిజన్స్. ఇంతకి లిటిల్ హార్ట్స్ మేకింగ్ వీడియోలో ఏముందంటే.. ఈ కాంబో ఇప్పటి వరకు ప్రపంచంలోనే లేదు.. ఈ చిత్రంతో అయ్యిందనే బ్యాగ్రౌండ్ వాయిస్ ప్రారంభమైంది. హెలికాప్టర్ని చూపించారు. కానీ, కట్ చేస్తే హీరో ఆటోలో దిగుతాడు. అతడికి డెబ్యూ స్టార్ హీరో అంటూ క్యాప్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత డైరెక్టర్ని పరిచం చేశారు. డెబ్యూ స్టార్ డైరెక్టర్ అంటూ చూపించారు.
ఇక నిర్మాతను కళ్లు లేనట్టుగా చూపించారు. ఆయనకు విజనరీ నిర్మాత అనే ట్యాగ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం తాను హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నా అంటూ హీరో గోప్పగా చెప్పుకుంటుండగా.. అసలు ఈ సినిమా హార్స్ రైడింగ్యే అవసరం లేదు.. ఆయన ఎందుకు నేర్చుకుంటున్నారో అర్థం కావడం లేదు.. కానీ డెడికేషన్కి హ్యాట్పాఫ్ అంటూ హీరోపై పంచ్ వేశారు. హీరో మౌళి.. ఈ సినిమా వీఎఫ్క్స్ కోసం వరల్డ్ టాప్ టెక్నిషియన్స్ని తీసుకున్నామని, ఇందులో టెక్నిషియన్.. ఇంగ్లీష్లో ఇంటర్య్వూ ఇస్తున్నట్టుగా.. ఇలా వీడియో మొత్తం ఫన్నీగా సాగింది. రిలీజ్కి రెండు రోజుల ముందు మేకింగ్ వీడియో పేరుతో మూవీ టీం చేసిన వినూత్న ప్రయత్నం ప్రేక్షకులను, నెటిజన్స్ని ఆకట్టుకుంటోంది.
వీడియో కాన్సెప్ట్ అదిరిపోయిందని, చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేశామంటున్నారు. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు పెద్ద సినిమాలు, బడా చిత్రాల దర్శక–నిర్మాతలను టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది. ఏమి లేని సినిమాకు వారు ఇచ్చే ఎలివేషన్ని ༀగా చూపించినట్టు అనిపించింది. ఇండస్ట్రీకి అప్పుడప్పుడే వచ్చిన ఈ కుర్రాళ్లని ఇండస్ట్రీ మొత్తాన్ని ట్రోల్ చేస్తున్నట్టుగా ఉంది. మరి దీనిపై ఇండస్ట్రీ వర్గాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. కానీ, ఏదేమైనా లిటిల్ హార్ట్స్ టీం చేసిన ఈ ప్రయత్నం.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ ఒక్క వీడియోతో టీం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇలా మేకింగ్ వీడియో మాదిరిలాగే.. సినిమా కూడా సరదాగా సాగుతుందని మూవీ టీం చెప్పకనే చెప్పింది. మరి సెప్టెంబర్ 25న విడుదలయ్యే ఈ చిత్రం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==