Lokesh Kanagaraj: ఫిల్మి ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా పద్ధతులు మారిపోయాయి. ఒకప్పుడు సినిమా రిలీజ్ కి కొన్ని రోజులు ముందు ఆడియో లాంచ్ ఈవెంట్లు జరిగేవి. ఆడియో లాంచ్ ఈవెంట్లో మొత్తం ఆరు పాటలను ఒకేసారి విడుదల చేసేవారు. తర్వాత ఆ సినిమాకి సంబంధించిన డివిడిలు మార్కెట్లోకి వచ్చేవి. కొన్ని రోజుల తర్వాత ఆ పాటలు వెంటనే ఇంటర్నెట్ లో దొరికేవి.
ఇప్పుడు మాత్రం కంప్లీట్ గా అదంతా మారిపోయింది. ఒక సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తారు. ఆ పాట చాలామందికి రీచ్ అయిన తర్వాత సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేస్తారు. ఇక ప్రస్తుతం చాలామంది ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ గురించి ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఆ ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ ని యూస్ చేసుకొని బీభత్సమైన వీడియోస్ ఎడిట్ చేస్తారు.
ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ పై లోకేష్ రియాక్షన్
తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో యంగ్ సెన్సేషన్ అనిరుద్ రవి చందర్. ఒక సినిమాను తన మ్యూజిక్ తో ఎలా లేపాలో అతనికి బాగా తెలుసు. చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో కొన్ని సీన్స్ కి అనిరుద్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒరిజినల్ ట్రాక్స్ దొరికితే వాటిని విపరీతంగా యూస్ చేసుకుంటారు కొంతమంది. ఇప్పటికే చాలావరకు అలా విడుదల చేశారు. లియో సినిమాకు సంబంధించి ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్ చేయలేదు. దీనిపై లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఆల్రెడీ సినిమాలోని బిట్స్ అన్ని బయటకు వచ్చేసాయి. ఇప్పుడు మేము రిలీజ్ చేసినా కూడా ఇవి ఆల్రెడీ విన్నవే కదా అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది. అందుకనే వాటిని రిలీజ్ చేయలేదు అని లోకేష్ క్లారిటీ ఇచ్చాడు.
తెలుగు తమిళ్ వరుస సెన్సేషన్
ఇక అనిరుద్ కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా చాలా సినిమాలు చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమా జులై 31న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. ఆల్రెడీ ఈ సినిమా పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు తాను చేసిన కూలి సినిమా కూడా ఆగస్టు 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Also Read: Vishwambhara : 100% సక్సెస్ కొడతా, వశిష్ట నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్