BigTV English

Saiyaara OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ సైయార…ఎప్పుడు? ఎక్కడంటే?

Saiyaara OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ సైయార…ఎప్పుడు? ఎక్కడంటే?

Saiyaara OTT: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు లేకుండా ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో బాలీవుడ్ చిత్రం సైయరా(Saiyaraa) ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా సుమారు 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. గత కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సక్సెస్ సినిమా రాలేదని చెప్పాలి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది.


మొదటి సినిమాతోనే అదరగొట్టిన ఆహాన్..

థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి సిద్ధంగా ఉంది. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే తనయుడు ఆహాన్ పాండే (Ahaan Pande)సైయారా సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఇక ఈయన స్వయంగా నటి అనన్య పాండే సోదరుడు అనే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఆహాన్ కు జోడిగా అనీత్ పద్దా (Aneeth Padda) హీరోయిన్ గా నటించారు. మోహిత్ సూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. జూలై 18వ తేదీ ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా విడుదల అయింది.


అంచనాలు లేకుండా హిట్ కొట్టిన సైయరా..

ఇక ఈ సినిమాలో నటీనటులందరూ కొత్తవాళ్లు కావటం విశేషం. ఇలా పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు నటించకపోయినా ఎలాంటి అంచనాలు లేకపోయినా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాపై ఇప్పటికి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఇలా థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిన ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు(OTT Release) సంబంధించి అధికారక ప్రకటన విడుదల చేశారు. సైయారా సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Net Flix) కొనుగోలు చేశారు.

ఈ సినిమాని సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఓటీటీలో ప్రసారం చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. థియేటర్లలో ఊహించని విధంగా సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి అంచనాలను అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక హీరోగా ఆహాన్ పాండే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి మొదటి సినిమాకి ఈ స్థాయిలో గుర్తింపు పొందిన ఆహాన్ తదుపరి వరుస అవకాశాలను అందుకుంటారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 8 వారాల వ్యవధిలో వ్యవధిలోనే ఓటీటీలోకి రాబోతున్న నేపథ్యంలో సినీ ప్రియులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: 3BHK OTT :నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్దార్థ్ 3BHK.. ఎక్కడ? ఎప్పుడంటే?

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×