M4M Movie : బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో ఇప్పటికే చాలా మర్డర్ మిస్టరీలు చూశాం. కానీ హత్య చేసిన తర్వాత మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో లాంటి గొప్ప పెయింటర్ల కళాఖండాల తరహాలో డెకరేట్ చేసే సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ M4M (మోటివ్ ఫర్ మర్డర్). ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందిన మూవీ త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇందులో హీరోయిన్ గా నటించిన జో శర్మ తాజా ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
యూనిక్ కాన్సెప్ట్ తో
అమెరికన్ నటి జో శర్మ హీరోయిన్‌గా, మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘మోటివ్ ఫర్ మర్డర్’. మే 8న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదలవుతోంది. PVR Inox Pictures ద్వారా విడుదల అవుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్‌కు ముందే 15 అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. మూవీ రిలీజ్ సందర్భంగా జో శర్మ మాట్లాడుతూ “ఈ సినిమాలో నా పాత్ర పేరు రాధ. నేను ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నాను. ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడా రాలేదు. ప్రతి హత్య తర్వాత కిల్లర్ ఆ శవాలను ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగ్స్ లాగా అలంకరిస్తాడు. ఇది చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది” అని చెప్పింది.
Also Read : సముద్రపు ఒడ్డున సయ్యాట… పాత ప్రేయసి రాకతో హీరో గుండెల్లో అలజడి… టాప్ రేటింగ్ తో అదరగొడుతున్న సిరీస్
విలన్ ఎవరో గెస్ చేస్తే లక్ష ప్రైజ్
ఆమె అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా కోసం మూడేళ్లు శిక్షణ తీసుకుంది. అంతేకాదు ఆమె అమెరికాలో థియేటర్ ఆర్టిస్ట్, అలాగే ఆమెకంటూ ఒక థియేటర్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉన్నట్టు తెలిపింది హీరోయిన్. మోహన్ వడ్లపట్ల, రాహుల్ అడవలతో కలిసి కో-రైటర్‌గా కూడా పని చేసింది. సినిమాలో ఏసీపీ కృష్ణ పాత్రలో హీరో ఉంటాడు. విలన్ ఎవరో ఊహించి చెప్పిన వారికి రూ. లక్ష ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఇప్పటికే లాస్ ఏంజెల్స్, లండన్, న్యూయార్క్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ వంటి అవార్డులు అందుకుంది. కేన్స్‌లో గ్లోబల్ ప్రీమియర్‌కు వచ్చిన విదేశీయులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
జో శర్మ మాట్లాడుతూ “నేను హైదరాబాద్‌లో పుట్టి, నాగ్‌పూర్, ముంబైలో పెరిగాను. తెలుగు, హిందీ, మరాఠీ అన్నీ వస్తాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున నాకు ఇష్టమైన హీరోలు. భవిష్యత్తులో యాక్షన్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనిపించుకోవడమే నా లక్ష్యం” అని చెప్పింది. ఇక మరికొన్ని గంటల్లో థియేటర్లలో రాబోతున్న ఈ సినిమాకు ప్రమోషన్లు సైతం డీఫెరెంట్ గా చేయడంతో అందరి దృష్టిలో పడింది. ముఖ్యంగా విలన్ ను గెస్ చేస్తే లక్ష ప్రైజ్ అన్నది అందరి దృష్టిని ఆకర్షించింది.