BigTV English

Mahesh Babu -Namrata: ఏంటీ.. మహేష్ నమ్రత విడిపోయారా.. బయటపడిన చేదు నిజం?

Mahesh Babu -Namrata: ఏంటీ.. మహేష్ నమ్రత విడిపోయారా.. బయటపడిన చేదు నిజం?

Mahesh Babu -Namrata: టాలీవుడ్ స్టార్ కపుల్స్ నమ్రత(Namrata) మహేష్ బాబు (Mahesh Babu) జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి మనకు తెలిసిందే. ఇక వీరిద్దరూ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శ దంపతులుగా నిలిచారు. వీరి వివాహం జరిగి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండగా నమ్రత మాత్రం కుటుంబ వ్యవహారాలతో పాటు పిల్లల బాధ్యతలను, వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నారు.


సినిమాలకు దూరం..

ఇకపోతే నమ్రత కూడా ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె మహేష్ బాబును పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడు తనకు సినిమా అవకాశాలు వచ్చినా కెమెరా ముందుకు రానని, ఒక్క నిమిషం కూడా కెమెరా ముందు కనిపించడానికి తాను ఇష్టపడనని తెలియజేశారు. ఇక పెళ్లికి ముందే మహేష్ బాబుకు ఇచ్చిన మాట ప్రకారమే సినిమాలకు దూరమయ్యాను అంటూ పలు సందర్భాలలో నమ్రత తెలిపారు.


భేదాభిప్రాయాలు…

ఇలా ఆదర్శ దంపతులుగా ఉన్నటువంటి వీరిద్దరికి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఎక్కువ కాలం వైవాహిక జీవితంలో కొనసాగలేరు. చిన్న చిన్న విషయాలకు విడాకులు (Divorce)తీసుకొని విడిపోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది పిల్లలు పుట్టినప్పటికీ కూడా విడిపోయిన వారు కోకొల్లలుగా ఉన్నారు. మహేష్ బాబు నమ్రత కూడా గౌతమ్(Gautham) పుట్టిన తర్వాత విడిపోయారని తెలుస్తోంది. కెరియర్ పరంగా మహేష్ బాబు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలోనే నమ్రత తల్లిదండ్రులను కూడా కోల్పోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఆ సమయంలో ఇద్దరు మధ్య బేధాభిప్రాయాలు చోటు చేసుకోవడంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ముంబై వెళ్ళిపోయిన నమ్రత…

ఇలా మహేష్ బాబుతో గొడవల కారణంగా నమ్రత తన కొడుకు గౌతమ్ ని తీసుకుని ముంబై వెళ్ళిపోయారట. కొద్దిరోజుల పాటు మహేష్ బాబుకు దూరంగా ఉన్నప్పుడే వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత బలపడిందని తర్వాత వారి తప్పు వారు తెలుసుకొని ఇద్దరు ఒకటయ్యారని తెలుస్తుంది. ఇలా వీరిద్దరి తమ వైవాహిక జీవితంలో అపార్థాలను తొలగించుకొని ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడిపారు.. ఇప్పటికీ కూడా అంతే సంతోషంగా జీవితంలో ముందుకెళ్తున్నారు తప్ప విడిపోవాలనే ఆలోచన ఏ మాత్రం లేదని చెప్పాలి. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి (Rajamouli)సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. మొదటిసారి రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.

Also Read: రష్మిక ముందు సాయి పల్లవి వేస్ట్.. పరువు తీసిన డైరెక్టర్?

Related News

Kangana Ranaut: క్యాస్టింగ్ కౌచ్ పై కంగనా కామెంట్స్.. అలా చేస్తేనే అవకాశం!

Betting Apps case: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో రానా..

War 2 Event : ‘వార్ 2’ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..?

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Big Stories

×