Rashmika -Sai Pallavi: తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగువారి కంటే కూడా ఇతర భాష హీరోయిన్లు ఎంతో మంచి అవకాశాలను అందుకుంటూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇలా ఇతర భాష సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగులో సక్సెస్ అందుకున్న వారిలో రష్మిక మందన్న (Rashmika Mandanna), సాయి పల్లవి(Sai Pallavi) వంటి హీరోయిన్లు కూడా ఉన్నారని చెప్పాలి. రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయం కాగా, సాయి పల్లవి మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇక ఈ ఇద్దరు హీరోయిన్లు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.
ఎవరు బెస్ట్ హీరోయిన్..
రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా, సాయి పల్లవి ఇప్పుడిప్పుడే బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. నటన పరంగా, డాన్స్ పరంగా ఈ ఇద్దరు ఎవరికి వారే సాటి అని చెప్పాలి. అయితే తాజాగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula)మాత్రం ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటూ ఎదురైన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
రష్మిక బిజీ హీరోయిన్…
శేఖర్ కమ్ముల ఇటీవల కుబేర (Kuberaa)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించారు.. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శేఖర్ కమ్ములకు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి మీరు నాగచైతన్యతోనూ ,నాగార్జునతో సినిమాలు చేశారు ఇద్దరిలో ఎవరి నటన బాగుంది అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు శేఖర్ కమ్ముల సమాధానం చెబుతూ నాగార్జున గారు చాలా సీనియర్ నటుడు ఆయనకు ఎలా చేయాలి? ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసు తనకు చెప్పాల్సిన పనిలేదని తెలిపారు. ఇక కొన్ని సందర్భాలలో నాగచైతన్యకు మేము కొన్ని సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళము అంటూ సమాధానం చెప్పారు.
బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి..
ఇకపోతే సాయి పల్లవి, రష్మిక ఇద్దరు కూడా మీతో సినిమాలు చేశారు. సాయి పల్లవి లవ్ స్టోరీ, ఫిదా సినిమాలలో నటించి సక్సెస్ అందుకుంది. రష్మిక కూడా కుబేరతో మంచి సక్సెస్ అందుకుంది మరి ఇద్దరిలో ఎవరినటన బాగుంది అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శేఖర్ కమ్ముల సమాధానం చెబుతూ ఇద్దరి నటన అద్భుతంగా ఉందని, ఇద్దరు తెలుగు చక్కగా మాట్లాడతారని తెలిపారు. ఇక రష్మిక అయితే క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారని ఆమె అలా షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టి తన పని పూర్తి చేసుకుని వెంటనే ఇంకో షూటింగ్ లొకేషన్లో ఉంటారు అంటూ రష్మిక గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ప్రస్తుతం రష్మిక గురించి, సాయి పల్లవి గురించి శేఖర్ కమ్ముల చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ తో కలిసిన నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: ఏంటీ అల్లు అర్జున్ రప్పా రప్పా కోసుకున్నాడా? వైరల్ అవుతున్న పోస్ట్