Face Pack For Skin Whitening: అందమైన, కాంతివంతమైన చర్మం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? కానీ ప్రస్తుత వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, రసాయనాలతో తయారు చేసిన క్రీములు వాడకం వల్ల చర్మం కాంతిని కోల్పోతుంది. మార్కెట్లో లభించే ఎన్నో రకాల ఫేస్ ప్యాక్‌లు తాత్కాలికంగా మెరుపును అందించినా.. వాటిలో ఉండే రసాయనాలు తర్వాత చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే సహజసిద్ధమైన, ఇంట్లో సులభంగా తయారు చేసుకునే ఫేస్ ప్యాక్‌లు ఉత్తమమైనవి. ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించకుండా చర్మాన్ని పోషిస్తాయి. అంతే కాకుండా కాంతివంతంగా చేస్తాయి. ఇంతకీ ఆ ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. పసుపు, శనగపిండి, పాలతో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
శనగపిండి- 1 టేబుల్ స్పూన్,
పసుపు- 1/2 టీస్పూన్
పాలు- తగినంత
తయారీ విధానం: పైన తెలిపిన పదార్థాలను కలిపి పేస్ట్‌లా చేయండి. తర్వాత ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు పట్టించి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖంపై కొత్త మెరుపు వస్తుంది.
ప్రయోజనాలు: పసుపు యాంటీ బయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మం రంగును మెరుగుపరుస్తుంది. శనగపిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో వాడిన పాలు చర్మానికి తగిన తేమను అందిస్తాయి. ఇది జిడ్డు చర్మానికి, పొడి చర్మానికి కూడా బాగా పనిచేస్తుంది.
2.తేనె, నిమ్మరసంతో ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
తేనె- 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం- , 1/2 టీస్పూన్
తయారీ విధానం: తేనె , నిమ్మరసం లను తగిన మోతాదులో తీసుకుని రెండింటినీ బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
ప్రయోజనాలు: తేనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది యాంటీబాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. నిమ్మరసం బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉండి, మచ్చలను తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు నిమ్మరసం తక్కువగా లేదా అసలు ఉపయోగించకూడదు.
3. ఓట్స్ , పెరుగుతో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
ఓట్స్- 2 టేబుల్ స్పూన్లు
పెరుగు- 2 టేబుల్ స్పూన్లు
Also Read: ఊడిన చోటే కొత్త జుట్టు రావాలంటే.. ఉల్లిపాయ జ్యూసే కరెక్ట్ !
తయారీ విధానం: ముందుగా ఓట్స్‌ను మెత్తగా పొడి చేసి.. పెరుగుతో కలపండి.ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని. ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఉంచి.. ఆపై సున్నితంగా రుద్దుతూ చల్లటి నీటితో శుభ్రం చేయండి.
ప్రయోజనాలు: ఓట్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి, మృతకణాలను తొలగిస్తుంది. పెరుగు చర్మానికి తేమను అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా కూడా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓట్స్ చర్మాన్ని తెల్లగా మెరిసేలా చేస్తాయి. ఓట్స్ తో తయారు చేసిన ఫేస్ ప్యాక్స్ వాడటం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై ట్యాన్ తొలగిపోయి తెల్లగా మెరవాలంటే.. తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్స్ క్రమం తప్పకుండా వాడటం అలవాటు చేసుకోండి.