Hero Prince:హీరో ప్రిన్స్ సెసిల్ (Prince Cecil).. ప్రముఖ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ప్రిన్స్ ‘బస్ స్టాప్’ అనే సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత రొమాన్స్, బన్నీ అండ్ చెర్రీ, మనసును మాయ చేయకే ఇలా పలు చిత్రాలలో హీరోగా నటించిన ఈయన.. 2016లో నాగచైతన్య (Naga Chaitanya)హీరోగా వచ్చిన ‘నైను శైలజ’ సినిమాలో హీరోయిన్ కి అన్న క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకున్నారు. ఇక హీరోగా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ వచ్చిన ఈయన డీజే టిల్లు, స్కంద, టిల్లు స్క్వేర్ అంటే చిత్రాలలో కూడా నటించారు. బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొని 56వ రోజు ఏడవ స్థానం నుండి ఎలిమినేట్ అయ్యారు.
హీరోగా ప్రిన్స్ కొత్త మూవీ ప్రారంభం..
ఇకపోతే ప్రిన్స్ హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఆయనకు మాత్రం సరైన సక్సెస్ లభించలేదని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు తాజాగా ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హీరో ప్రిన్స్ ఈ సినిమాతో విజయం అందుకోవాలని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
కొత్త మూవీ విశేషాలు..
కొత్త మూవీ విషయానికి వస్తే సుహానా ముద్వాన్ (Suhana mudvan) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. సునైనా, నెల్లూరు సుదర్శన్ ప్రధాన పాత్రల్లో కుమార్ రవి కంటి (Kumar Ravikanti) దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైట్ స్టోర్మ్ సెల్లులోయిడ్స్ పై కుమార్ రవికంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. KL స్టూడియోలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇక ఈ చిత్ర దర్శకుడు కుమార్ రవి కంటి మాట్లాడుతూ.. “ఈ చిత్రం జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఏకధాటిగా చిత్రీకరణ జరుపుకొని, విదేశాలలో సాంగ్స్ షూటింగ్ జరుపుకోనుంది. అద్భుతమైన సాంకేతిక విలువలు కలిగి ఉన్న చిత్రం ఇది” అంటూ తెలిపారు.
చిన్నారుల చేతుల మీదుగా సినిమా ఆరంభం..
ఇకపోతే ముహూర్తపు సన్నివేశానికి బేబీ దియా రవికంటి క్లాప్ కొట్టగా.. సుమా రవి కంటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక ఆయన బేబీ మాయ రవికంటి మొదటి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
Also read: Pawan Kalyan:తీరని కోరికతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. భవిష్యత్తులో కూడా సాధ్యపడదంటూ!