SSMB29 : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా SSMB29. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం రాజమౌళి అనే బ్రాండ్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి తెలిసేలా చేసింది. అయితే మొదటిసారి ఎస్.ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో మహేష్ బాబు ఎప్పుడూ కనిపించిన విధంగా ఈ సినిమా కోసం కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. మహేష్ బాబు ఎయిర్పోర్ట్లో కనిపించిన ప్రతిసారి మహేష్ బాబు లుక్ రివిల్ అవుతుంది. దీంతో ప్రేక్షకులు అంచనాలు మరింత పెరిగిపోయాయి.
షూటింగ్ క్యాన్సిల్
మహేష్ – రాజమౌళి సినిమా కోసం కెన్యా లో ఒక షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం కెన్యాలో శాంతి భద్రతల సమస్య నెలకొంది.ఇందుకోసమే కెన్యాలో జరగవలసిన ఒక షెడ్యూల్ క్యాన్సిల్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ షెడ్యూల్ కోసం సెలెక్ట్ చేసిన లొకేషన్స్ ఇప్పుడు అవైలబుల్ గా లేవు. ఆ సీన్స్ ఎక్కడ చెయ్యాలి అనే విషయం లో రాజమౌళి ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. ఒకసారి లొకేషన్ ఫిక్స్ అయిపోయిన తర్వాత చాలా ప్లానింగ్ తో ఉంటారు చిత్ర దర్శకులు. ఆ తరువాత అది అవైలబుల్ గా లేదు అంటే మరో లొకేషన్ వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఇక ప్రస్తుతం SSMB29 సినిమాకి కూడా అదే సమస్య ఎదురయింది.
Also Read : Dil Raju : హీరోలకు షాకింగ్ కండిషన్స్ , చేసి తీరాల్సిందే
తారస్థాయి అంచనాలు
మహేష్ బాబు క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే. తెలుగులో మహేష్ బాబుకి , పవన్ కళ్యాణ్ కి ఉన్న స్టార్ డం మరో హీరోకి లేదు. మిగతా హీరోలకి పాన్ ఇండియా రేంజ్ లో ఉంది. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చేయలేదు. మొదటిసారి మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. అది కూడా రాజమౌళి వంటి దర్శకుడు చేతిలో పడ్డాడు. ఇక్కడితో మహేష్ బాబు ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా చాలామంది సాధారణ ఫాన్స్ కు కూడా అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి.
Also Read : Megastar Chiranjeevi: చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన కూల్ డ్రింక్ ని బ్యాన్ చేశారు