Jagan Tour: జగన్ చిత్తూరు టూర్ మళ్లీ గొడవకు వేదిక అవుతుందా? ర్యాలీలు, రోడ్ షోలు లేకుండా జగన్ యాత్ర సాగుతుందా? ఇన్నాళ్ల మాదిరిగా బల ప్రదర్శనకు పోలీసులు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదా? తక్కువ మందితో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారా? పల్నాడు తరహా మారిదిగా జరిగితే శాశ్వతంగా జగన్ టూర్లకు బ్రేక్ పడనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీ అధినేత జగన్ టూర్లు అనే సరికి భారీ కాన్వాయ్ ఉంటుంది. దీనికితోడు జన సమీకరణ గురించి చెప్పనక్కర్లేదు. గతంలో రాప్తాడు, ఒంగోలు, పల్నాడు పర్యటనలే ఇందుకు ఓ ఎగ్జాంఫుల్. అవన్నీ గమనించిన తర్వాత చిత్తూరు పోలీసులు జగన్ టూర్‌పై జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. జూలై 9న బంగారు పాళ్యం పర్యటనకు జగన్ వెళ్లనున్నారు. దీనికి చిత్తూరు పోలీసులు అనుమతి ఇచ్చారు.
కఠినమైన షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. బంగారుపాళ్యం మార్కెట్ యార్డు విస్తీర్ణంలో తక్కువగా ఉంది. జగన్‌తోపాటు మరో 500 మందికి అనుమతి ఇచ్చారు పోలీసులు. ఎక్కువ మంది వస్తే భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ఈ ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. హెలిప్యాడ్ వద్దకు కేవలం 30 మందికి అనుమతి ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే హెలిప్యాడ్‌కు అనుమతి ఇచ్చారు కూడా. ఎలాంటి ర్యాలీలు, రోడ్డు షోలు చేయకూడదన్నది మరో కీలకమైన పాయింట్. ఈ మేరకు వైసీపీ నేతలకు పోలీసులు సమాచారం ఇచ్చారు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకున్న పోలీసులు, ఈసారి జగన్ పర్యటనకు జాగ్రత్తలు అలాగే తీసుకుంటున్నారు.
ALSO READ: విజయవాడలో ఆసమస్యకు ఫుల్‌స్టాప్.. ఒకేసారి 500 కార్లు
జగన్ చిత్తూరు పర్యటనకు 10 వేల మంది వస్తారని, అందుకు తగిన విధంగా ఏర్పాటు చేసుకుంటామని గతవారం పోలీసులను వైసీపీ నేతలు కోరారు. అందుకు ససేమిరా అన్న పోలీసులు, ఆంక్షలు విధించారు. పల్నాడు ఘటనలో 113 మంది నేతలు, కేడర్‌పై కేసులు నమోదయ్యాయి. వారంతా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో జగన్ టూర్‌కు అంతమంది రాకపోవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మామిడి సీజన్ ముగిసిన తర్వాత రైతులతో జగన్ మాట్లాడడం విడ్డూరం కాకపోతే ఏంటన్నది మరోవైపు బలంగా ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. తోతాపురి మామిడి రకానికి ధరలు తగ్గినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని జగన్ ప్రధాన వాదన. ఈ క్రమంలో రైతులను పరామర్శించనున్నారట జగన్.
మొన్నటికి మొన్న కుప్పం వెళ్లిన సీఎం చంద్రబాబు, చిత్తూరు జిల్లా మామిడి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు కూడా. అంతా అయిన తర్వాత ఇప్పుడు జగన్ వెళ్లడం అనవసరమని వైసీపీలోని కొందరు నేతల మాట. ఈసారి జగన్ పర్యటనలో ఏమైనా గందరగోళం జరిగితే శాశ్వతంగా ఆయన యాత్రలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట పోలీసులు.
ఎల్లుండి వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పోలీసుల అనుమతి
మార్కెట్‌యార్డు చిన్నది కావడంతో 500 మందికి మాత్రమే అనుమతి
ఇప్పటికే హెలిప్యాడ్‌కు అనుమతిచ్చిన చిత్తూరు పోలీసులు
హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మందికి మాత్రమే అనుమతి
ర్యాలీలు, రోడ్‌షోలు చేయకూడదని పోలీసుల నిబంధన pic.twitter.com/XJN9EjRQE5
— BIG TV Breaking News (@bigtvtelugu) July 7, 2025