Migraine: నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో.. చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి స్క్రీన్ చూస్తూ పనిచేయడం వల్ల కళ్ళు దెబ్బతినడమే కాకుండా..ఒత్తిడి, తలనొప్పి సమస్య కూడా పెరుగుతోంది. అంతే కాకుండా కొంత మంది తలనొప్పిని సాధారణం అని భావించి విస్మరిస్తారు. ఇది ఒక సాధారణ సమస్య కావచ్చు. కానీ తలనొప్పి నిరంతరం కొనసాగితే, అది మైగ్రేన్ కూడా కావచ్చు.
మైగ్రేన్ అనేది ఒక తీవ్రమైన సమస్య. దీనిలో కొన్నిసార్లు మనకు భరించలేని తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ వెనుక అనేక కారణాలు ఉంటాయి. అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం, ఇవన్నీ మైగ్రేన్‌కు కారణాలు . మైగ్రేన్ నొప్పి పెరిగినప్పుడు, విశ్రాంతి లేకుండా, వాంతులు, ప్రకాశవంతమైన కాంతి కారణంగా భయాందోళనలకు గురవుతుంటారు. చాలా సార్లు నుంచి దీని నుంచి ఉపశమనం పొందడానికి మందులను ఆశ్రయిస్తారు. కానీ కొన్ని హోం రెమెడీస్ మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో కూడా ప్రభావ వంతంగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం టీ:
అల్లం టీ తాగడం వల్ల మైగ్రేన్ వల్ల కలిగే తీవ్రమైన తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిజానికి, అల్లం తలనొప్పిని తగ్గించే సహజ లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లం టీ తాగడం వల్ల నొప్పి తగ్గడమే కాకుండా.. వికారం సమస్య కూడా తగ్గుతుంది. మీరు కనీసం రెండుసార్లు అల్లం టీ తాగితే, మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క అనేది మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగించే ఒక మసాలా. దీనిని ఉపయోగించడానికి.. మీరు రెండు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిని మందపాటి పేస్ట్‌గా తయారు చేసి.. తర్వాత దానిని మీ నుదిటిపై పూయాలి. అరగంటలోపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Also Read: రోజూ ఒక స్పూన్ గుమ్మడి గింజలు తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు
నీళ్లు బాగా తాగండి:
శరీరంలో నీరు లేకపోవడం వల్ల కూడా మైగ్రేన్ నొప్పి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో.. మీరు ఈ నొప్పి నుంచి బయటపడాలనుకుంటే.. రోజంతా కనీసం ఐదు లీటర్ల నీరు తాగాలి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.
కోల్డ్ కంప్రెస్ కూడా వేయండి:
మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, మీరు నుదిటిపై చల్లని కట్టు కూడా ఉంచుకోవచ్చు. ఇది తల నరాలను చల్లబరుస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం కూడా అందిస్తుంది.