E-Paper
Advertisement

ఫాన్స్ కి గుడ్ న్యూస్..వారణాసి నుంచి మహేష్ రాముడి లుక్ ..ఆ స్పెషల్ డే రిలీజ్?

ఫాన్స్ కి గుడ్ న్యూస్..వారణాసి నుంచి మహేష్ రాముడి లుక్  ..ఆ స్పెషల్ డే రిలీజ్?
Advertisement

Varanasi Film: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (Rajamouli)ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం వారణాసి(Varanasi). ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని 2027 ఏప్రిల్ ఏడో తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. మరొక నాలుగు నెలలు ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే కుంభ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సైతం సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి.

రాముడిగా మహేష్ బాబు..

ఇకపోతే త్వరలోనే ఈ సినిమా నుంచి మరొక బిగ్ అప్డేట్ రాబోతోందని సమాచారం. సినీ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం మే 31వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రాబోతోందని తెలుస్తోంది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మహేష్ బాబు రాముడి పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. వారణాసి సినిమాలో సుమారు అరగంట పాటు మైథాలజీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో మహేష్ బాబు రాముడిగా కనిపించబోతున్నారు.

కృష్ణ జయంతి సందర్భంగా..

Advertisement

ఇప్పటికే మహేష్ బాబు రాముడి లుక్ కి సంబంధించిన కొన్ని రిఫరెన్స్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈయన రాముడి పాత్రలో ఎలా ఉండబోతున్నారో చూడటం కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు. ఇలా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రాముడి లుక్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న విడుదల చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని తెలుస్తోంది. మహేష్ రాముడి పాత్రకు సంబంధించిన లుక్ ఇప్పుడే విడుదల చేస్తే థ్రిల్ ఉండదని నేరుగా థియేటర్లో చూస్తేనే అభిమానులు కూడా థ్రిల్ గా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం అయితే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున లీకేజీలు అవుతున్న నేపథ్యంలో ఆ భయం కారణంగానే విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తుంది.

గ్లోబల్ రేంజ్ లో వారణాసి..

Advertisement

మరి నిజంగానే కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మహేష్ బాబు రాముడి లుక్ కి సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తారా? లేదంటే మరి ఏదైనా అప్డేట్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక చోప్రాతో పాటు పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్, మాధవన్ వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాకు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాతలుగా వ్యవహరించగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read: పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న ‘తిమ్మరాజు పల్లి టీవీ..’ ట్రైలర్ రిలీజ్!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×