Dharma Mahesh:ధర్మ మహేష్ (Dharma Mahesh).. ఈ పేరు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈయన ‘డ్రింకర్ సాయి’ అనే సినిమాతో హీరోగా పరిచయమైనా.. తన భార్య గౌతమీ చౌదరి (Gautami Chaudhary) చేస్తున్న ఆరోపణల కారణంగానే ఊహించని పాపులారిటీ దక్కించుకున్నారు. ప్రేమించి వివాహం చేసుకున్న ధర్మా మహేష్.. భార్య 2023లో గర్భం దాల్చాక బరువు పెరగడంతో తనను పక్కనపెట్టి మరో అమ్మాయితో తిరుగుతున్నాడు అంటూ.. ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేసింది. గత రెండు సంవత్సరాల క్రితం తన భర్త తనను మోసం చేసి వేరొకరితో తిరుగుతున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన గౌతమీ చౌదరి.. ఆరోజు ఆ అమ్మాయి పేరు బయట పెట్టలేదు.. కానీ ఇప్పుడు సరైన సమయం చూసుకొని ఆ అమ్మాయి పేరు బయట పెట్టడమే కాకుండా అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను కూడా బయటపెట్టింది.
ఆ అమ్మాయి ఎవరో కాదు ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ , జబర్దస్త్ కమెడియన్, టీవీ సీరియల్ యాక్ట్రెస్ రీతూ చౌదరి (Rithu Chowdhary). ప్రస్తుతం రీతూ చౌదరి బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) లో కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో గౌతమి.. తన భర్త ధర్మా మహేష్ తో రీతూ చౌదరి ఉన్న వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో లీవ్ చేయడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది. రీతు చౌదరి వల్లే 13 ఏళ్ల తమ బంధం బ్రేక్ పడింది అని..రాత్రిళ్ళు మాత్రమే తమ ఫ్లాట్ కి వస్తుంది అంటూ రీతూ చౌదరి పై ఊహించని కామెంట్లు చేసింది. అయితే రీతు చౌదరిపై అలాంటి కామెంట్లు చేసిన ఈమె ఇప్పుడు మరో హీరోయిన్ పై కూడా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
also read:Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!
కిరాక్ సీత నన్ను బెదిరించింది – గౌతమీ చౌదరి
ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ ఫేమ్ కిరాక్ సీత(Kiraak Seeta).. గౌతమి మాట్లాడుతూ..” నా రెస్టారెంట్ 16వ బ్రాండ్ ను ప్రారంభించడానికి ఒక క్రికెటర్ ను ఆహ్వానించాలని ప్లాన్ చేసుకున్నాను. అయితే ఆ సమయంలో కిరాక్ సీత నాకు ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టింది. నువ్వు ఎలా రెస్టారెంట్ ఓపెన్ చేస్తావో నేను చూస్తా.. నాకు పెద్ద పెద్ద క్రికెటర్స్ తెలుసు.. అని మెసేజ్లు చేసింది. అసలు నా రెస్టారెంట్ గురించి ఆమెకు ఎందుకు? నా విషయాలలో ఆమె ప్రమేయం ఏమిటి? ఆమె వెనుక నా భర్త ఉన్నాడని నాకు అర్థమైంది? నువ్వు రెస్టారెంట్ ఎలా ఓపెన్ చేస్తావో చూస్తానంటూ నన్ను సీత బెదిరించింది. మా ఇంటికి కూడా వచ్చింది. అసలు నా భర్తకు – సీతకు మధ్య ఎలాంటి సంబంధం ఉందో నాకు తెలియదు” అంటూ హాట్ బాంబు పేల్చింది గౌతమి.
నిన్న రీతూ.. నేడు సీత.. రేపు ఎవరో?
ప్రస్తుతం గౌతమి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిన్నటి వరకు రీతూ.. నేడు సీత ఇంకా రోజులు మారేకొద్దీ ఇంకెంతమంది పేర్లు చెబుతుందో అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ధర్మా మహేష్ ఇంతమంది అమ్మాయిలతో రిలేషన్ కొనసాగిస్తున్నారా అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఈ ఎఫైర్ రూమర్స్ కి ఎప్పుడు చెక్ పడుతుందో చూడాలి.