Hero Suriya:సినీ ఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలో అయినా సరే మోసం అనేది ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. మనం నమ్మిన వ్యక్తులే మనల్ని మోసం చేస్తున్నారు అన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అప్పుడప్పుడు అనుకోని సందర్భాలలో మోసపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరో సూర్య (Suriya) భద్రతాధికారి కూడా ఒకరిని నమ్మి ఏకంగా 42 లక్షల రూపాయలు మోసపోయారు. మరి ఇదంతా ఎలా జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న సూర్య.. ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతగా పలు చిత్రాలకు పని చేస్తూ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం కోలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో కూడా భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలిచారు. కారణం ఆయన సెక్యూరిటీ ఆఫీసర్. విషయంలోకి వెళ్తే ..సూర్య భద్రతాధికారి ఆంటోనీ జార్జ్ ప్రభు (Antony George Prabhu) ఇప్పుడు ఆర్థికంగా మోసపోయారు. సూర్య పనిమనిషి కుటుంబమే ఆయనను మోసం చేసింది.
ALSO READ:Dharma Mahesh: నిన్న రీతూ చౌదరి.. నేడు మరో హీరోయిన్.. గౌతమి సంచలన కామెంట్స్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాము చెప్పినట్టుగా పెట్టుబడి పెడితే అధిక వడ్డీ పొందవచ్చు అని సూర్య ఇంట్లో పనిచేసే సులోచన, ఆమె కుమారుడు .. భద్రతాధికారిని నమ్మించారు..ఈ మేరకు ముందుగా లక్ష రూపాయల పంపించిన ఆయన.. మరో రెండు నెలల్లో మొత్తంగా 42 లక్షలు నిందితులకు బదిలీ చేశారట. అయితే నిజం తెలుసుకున్న భద్రతాధికారి మొత్తం డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఆమెతోపాటు కుటుంబం మొత్తం పారిపోయింది.
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు..
దర్యాప్తు చేసిన పోలీసులు గతంలో కూడా ఈ కుటుంబం పలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. అంతేకాదు నిందితులను అరెస్టు చేశామని తాజాగా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి దీనిపై హీరో సూర్య ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.
వెంకీ డైరెక్షన్లో సూర్య 46వ మూవీ..
హీరో సూర్య విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ కోసం కొత్త షెడ్యూల్ కి సిద్ధమవుతోంది. ఇకపోతే ఈ సినిమా కోసం సూర్య భారీ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. నిజానికి మే 2025 లో ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాదులో ఘనంగా ప్రారంభించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ (Naga Vamsi) నిర్మిస్తున్న ఈ సినిమాలో మమిత బైజు (Mamitha baiju) హీరోయిన్ గా నటిస్తోంది. జీవి ప్రకాష్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. సార్ , లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి చిత్రానికి వర్క్ చేయడంపై జీవి ప్రకాష్ స్పందిస్తూ.. హ్యాట్రిక్ కోసం వర్క్ చేయడం మరింత సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. సూర్య 46వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది.