November 7 Movie Releases : ప్రతి నెల థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ అయిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలేదు. కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా జనాలను బాగా అలరించాయి.. దాంతో ఆ సినిమాలన్నీ పాజిటివ్ టాక్ తో పాటుగా.. కోట్లు రూపాయలను అందుకున్నాయి. అలాగే నవంబర్ మొదటి వారంలో బోలెడు సినిమాలో థియేటర్లోకి రాబోతున్నాయి.. నవంబర్ 7న చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం..
7న నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ పాత్రలో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ థియేటర్లలోకి వస్తోంది. ఇందులో ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ట్రైలర్ తో భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది.. కాలేజీ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్య క్రియేట్ అయ్యే సీన్స్.. అంతే కాదు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది.. ఈ చిత్రం భారీ అంచనాలతో రేపు థియేటర్లలోకి రాబోతుంది…
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం జటాధర.. హారర్ కామెడీ జోన్ లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ధన పిశాచి జనాలను ఎలా పీడిస్తుంది అన్న స్టోరీ తో ఈ సినిమా రాబోతుంది.. ఇటీవలే ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ మూవీ రేపు థియేటర్లోకి రాబోతుంది.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తనయుడు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డయాస్ ఈరే.. కామెడీ హారర్ మూవీ గా రాబోతున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలోకి రాబోతుంది..
Also Read :దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?
ఇవి మాత్రమే కాదు.. వీటితో పాటుగా తిరువీర్ హీరోగా నటించిన ‘ప్రీవింగ్ షో’ తో పాటు విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది.. ఇకపోతే ‘వృషభ’, ‘హరికథ’ అనే మరో రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటికి పెద్దగా ప్రమోషన్ ఏమీ చేయడం లేదు మేకర్స్.. అయితే రేపు థియేటర్లో రిలీజ్ కాబోతున్న సినిమాలలో రష్మిక మందన్న సినిమా పైనే ఎక్కువ ఫోకస్ ఉంది. ఈమె వరసగా బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటిస్తూ ఉండడమే దీనికి కారణం. ఈ మూవీ కూడా మంచి టాక్ ని అందుకుంటుందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి రేపు రిలీజ్ కాబోతున్న సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుందో చూడాలి…